-పదేళ్లలో హైదరాబాద్ కు కేంద్రం ఎంతో సాయం చేసింది
– బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు పదేళ్లలో రూ.9 లక్షల 26 వేలకోట్లుఇచ్చింది. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి రూ.26 వేల కోట్లు కేటాయించింది. ఇది పూర్తయితే అనేక పరిశ్రమలు వస్తాయి. ఆర్ఆర్ఆర్ తెలంగాణ గేమ్ చేంజర్ గా మారుతుంది. యూపీఏ హయాంలో తెలంగాణలో ఏడాదికి 17 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం. ప్రధాని మోదీజీ హయాంలో రూ.32 వేల కోట్ల ఖర్చుతో 1,645 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోంది.
హైదరాబాద్ మెట్రోకు రూ.1204 కోట్ల నిధులు కేంద్రం కేటాయించింది. హైదరాబాద్ లో బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి జరుగుతుంది. ఇది శంషాబాద్ విమానాశ్రాయంమాదిరిగా ఆధునీకరించబడుతోంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఆధునిక వసతులతో సిద్ధమవుతోంది. రూ.221 కోట్ల వ్యయంతో శాటిలైట్ రైల్వే టెర్మినల్ అప్ గ్రేడ్ అవుతోంది.
లింగంపల్లి-ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభమైంది. రూ. 343 కోట్ల వ్యయంతో 22 కి.మీ. మేర విస్తరించిన లైన్ తోపాటు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రధానిమోదీజీ ప్రారంభించారు. రాష్ట్రంలో 15 కొత్త రైల్వే లైన్లు, మరో 15 అదనపు లైన్లు కలిపి మొత్తం 30 ప్రాజెక్టులకు రైల్వేశాఖ తుది సర్వే మంజూరు చేసింది. 564 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు రూ.12,408 కోట్ల వ్యయమవుతుందని కేంద్రం అంచనా వేసింది.
రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి, చిట్యాల, షాద్నగర్, షాబాద్ అనుసంధానం అవుతాయి.
తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్ గా మారుతుంది. ఇలా మొత్తం రూ.80 వేల కోట్లతో తెలంగాణలో వివిధ రైల్వే ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికల రూపకల్పన జరిగింది. ఇవిమొత్తం కార్యరూపందాల్చితే తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి.