ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా

Spread the love

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉంది. హైదరాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. సికింద్రాబాద్- విజయవాడ మధ్య రైల్వే ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టాల్సి ఉంది.

అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్లాన్ చేశారు.కానీ, ప్రధాని షెడ్యూల్ లో మార్పుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తుంది. మోదీ రాకపోవడంతో ఈ పనులన్నీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, త్వరలోనే మోదీ తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Leave a Reply