Suryaa.co.in

Andhra Pradesh

దుష్టశిక్షణ కోసమే పొత్తులు

-బీజేపీ మూల సిద్దాంతం అట్టడుగు వర్గాల సంక్షేమమే
-కోటి మంది అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యం
-బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి

అమరావతి : టీడీపీతో పొత్తు ఖరారు అయ్యింది. ఎన్ని సీట్లు, ఎక్కడనుంచి పోటీ అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. రాముడు అంతటి వాడు అందరి సహకారం తీసుకున్న విషయం ప్రస్తావిస్తూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తుల అవసరం ఉంది. రాష్ట్ర హితంకోసం అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉంటాం.

మేనిఫెస్టో తయారీ లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రచార రధాల్లో ప్రజల అభిప్రాయం సేకరణ పత్రాలు ఒక బాక్స్ లో నిక్షిప్తం చేస్తాం. జాతీయ స్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల కుటుంబాల నుండి అభిప్రాయాలను స్వీకరిస్తాం. ఇప్పటికే రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో కమిటీ రెండు పర్యాయాలు సమావేశమైంది. అనేక అంశాలు పై చర్చ జరిగింది.

పదేళ్లుగా ప్రధాని మోదీ చేసిన సేవ ఎనలేనిది. వచ్చే ఐదేళ్లలో ఏం చెయ్యబోతున్నామో ప్రచార రథాల ద్వారా వివరిస్తాం. బీజేపీ మూల సిద్దాంతం అట్టడుగు వర్గాల సంక్షేమమే. ప్రచార రథాలలో రెండు బాక్సులు ఉంటాయి. ఒక బాక్సులో కేంద్రంనుంచి మీరేమీ ఆశిస్తున్నారో అభిప్రాయాలు సేకరిస్తాం. మరో బాక్సులో రాష్ట్రం కోసం ఏం కావాలో అభిప్రాయాలు సేకరిస్తాం. కోటిమంది అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యం. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మానిఫెస్టోలో చేరుస్తాం.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, బిజెపి కోర్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, సాధినేని యామినీ శర్మ, కనిగిరి నీలకంఠ ప్రచార రథాలు ఇంఛార్జి పాలపాటి రవికుమార్, మువ్వల వెంకట సుబ్బయ్య,వనమా నరేంద్ర, అలోకం సుధాకర్
తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE