Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా

ఎంపీ విజయసాయిరెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ సామర్ధ్యం పెంచడం ద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిఎం జగన్ 16 సబ్ స్టేషన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి,12 సబ్ స్టేషన్లను ప్రారంభించారని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు..కడపలో 750 మెగావాట్లు,అనంతపురంలో 100 మెగావాట్లు సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిఎం మంగళవారం శంకుస్థాపనలు చేశారని తెలిపారు.

ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది
సులభంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందేలా పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలను చేపడుతోందని ఆయన అన్నారు.. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడిన, ప్రమాదానికి గురైన వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలను అందిస్తోందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించిందని ఆయన తెలిపారు.

పురందేశ్వరికి వైజాగ్ ప్రజలంటే కోపం
2019లో ఎన్నికల్లో ఓడించినందుకు పురందేశ్వరి వైజాగ్ ప్రజలపై తన కోపాన్ని బయటపెడుతున్నారని అన్నారు. కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా టీడీపీ రాజకీయ నాయకులను ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని కలిపించే బదులు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం ప్రయత్నాలు చేయాలని కోరుకుంటునాని చెప్పారు.

LEAVE A RESPONSE