హవ్వ… రాజన్న రాజ్యం అంటే ఇదేనా?

– జీతాలు ఇవ్వలేని… చట్టాలు పట్టని ప్రభుత్వమా??
-రాతి యుగం నాటి రోడ్లు… విద్యుత్ లేక ప్రజలు అల్లాడిల్సిందేనా?
– పరిపాలన పక్కనపెట్టి పీతల కొట్టు చేపల కోట్టు పెట్టడమా?
– ఇదేనా జగనన్న ప్రవచించే రాజన్న రాజ్యం
– మత్స్య కార్మికులకు ఆర్థిక సహాయం సరే.. ఉద్యోగుల జీతాల మాటో మరి!
– ఎన్నిసార్లు కోర్టులు చివాట్లు పెట్టిన బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం
– బెయిల్ రద్దు కోరుతూ హౌస్ మోషన్ పిటిషనా… కోర్టు అనుమతిస్తుందనుకోవడం లేదు
– గడపగడపకు వచ్చేవారిని సమస్యలపై ప్రశ్నించండి …
నిలదీయండి
– నూటికి 90 శాతం ప్రజలు ప్రధాన ప్రతిపక్షం వైపే
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడం… చట్టాలను పట్టించుకోకపోవడం… రాతి యుగము నాటి అధ్వానపు రోడ్లు… విద్యుత్తు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడడ మే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవచించే రాజన్న రాజ్యమా? అంటూ నరసాపురం లోక సభ సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందక తాము నెలసరి వాయిదాలు కూడా కట్టుకోలేక పోతున్నామని అల్లాడిపోతూ, రోడ్డు ఎక్కుతున్నారా అన్నారు. విద్యుత్ ఉద్యోగులు జీతాల కోసం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందేనని, ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేశారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ… మత్స్య కార్మికులకు ఆర్థిక సహాయం చేయడాన్ని ఎవరు తప్పు పట్టార ని, కానీ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. నాలుగు నెలలు పని ఉండదన్న కారణంగా మత్స్య కార్మికులకు ఆర్థిక సహాయం చేసేందుకు బటన్ నొక్కు కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పని చేసిన ఉద్యోగులకు జీతాలు ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగులు తాము వసూలు చేసే కరెంటు బిల్లుల నుండి కొంత సొమ్మును తీసి విధిగా ఏర్పాటు చేసుకొని జీతాలను తమకు తామే ఇచ్చుకునే పరిస్థితులు తలెత్త ను న్నాయన్నారు.

పీతల, చేపల కొట్టు పెట్టడానికి కాదు…
పరిపాలన పక్కనపెట్టి పీతల, చేపల, రొయ్యల కొట్టు లను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డిని ఎన్ను కోలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.. గడపగడపకు ప్రభుత్వం అంటే ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా గడపగడపకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే ఏమిటని వాలంటీర్ల వ్యవస్థ అంటూ అపహాస్యం చేశారు.

గడపగడపకు వెళ్లడానికి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు భయం… భయంగా, గుండె ను అదుపులో పెట్టుకొని, ఎవరైతే తమను ప్రశ్నించారో, పోలీసు పహారాలో వారి వద్దకు వెళ్లాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి ప్రభుత్వ పథకం అంద లేదని ప్రశ్నించగా, ఆ వ్యక్తికి అమర్నాథ్ అనే శాసనసభ్యుడు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోందనీ, ప్రజలకు వార్నింగ్ ఇవ్వడానికి గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిందనీ రఘు రామ విరుచుకుపడ్డారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న అధికారులను, శాసనసభ్యులను టిడిపి వారు నిలదీస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఏ వర్గము సంతోషంగా లేదు
జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటకు రారు కనుక ఆయనకు కనిపించడం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎప్పుడో దూరమయ్యారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మనము గ్రహిస్తే మనకు మంచిదని, లేకపోతే ప్రజలకు మంచిదని అన్నారు. ప్రశ్నించే ప్రజలంతా సజ్జల పేర్కొన్నట్టుగా టిడిపి వారైతే నూటికి 90 శాతం మంది ప్రధాన ప్రతిపక్షం వైపే ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

విద్యా దీవెన, వసతి ఓ బోగస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పు కుంటున్న విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమం ఓ బోగస్ అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. విద్యార్థులందరికీ విద్య వసతి కింద అందజేసే ఒక వాయిదా మొత్తాన్ని ఎగవేశా రన్న ఆయన, మరి కొంతమందికి రెండు వాయిదాలను జమ చేయలేదని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయమై గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ వద్దకు వచ్చే అధికారులను, శాసనసభ్యులను నిలదీయాలని సూచించారు. తమ సమస్యను ముఖ్యమంత్రికి నివేదించి తక్షణమే విద్యా దీవెన, వసతి వాయిదాల సొమ్మును ఇప్పించాలని డిమాండ్ చేయాలన్నారు. ఎమ్మెల్యేలను, అధికారులను ప్రశ్నించే ట ప్పుడు, ఆ సంభాషణ మొత్తము సెల్ ఫోన్ లో రికార్డు చేయాలని సూచించారు.. దానితో ఎమ్మెల్యేలు ఎంత పరుషంగా సమాధానం చెప్పేది .. ప్రపంచానికంతా తెలుస్తుందన్నారు. అధ్వాన పు రోడ్ల సమస్య, చెత్త సమస్య, చెత్త పన్ను గురించి , విద్యుత్ సరఫరా పై ఉన్న అభ్యంతరాలు వివరించాలని రఘురామకృష్ణంరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. తమకు సత్ పరిపాలన అందించాలని పీతలు, రొయ్యలు, చేపల కొట్టు లు వద్దని చక్కటి పరిపాలన అందించాలని ప్రజలు కోరాలన్నారు. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలనుకునే జగనన్న ప్రభుత్వం గడపగడపకు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క సమస్యను ప్రజలు వివరించాలని పేర్కొన్నారు.

కాన్వాయ్ బకాయిలు చెల్లించండి
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బిల్లు బకాయిలు 22 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిసిందని, ఈ బకాయిలు తక్షణమే చెల్లించకపోతే ఒంగోలు తరహా ఘటనలు మరిన్ని పునరావృతమయ్యే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాదిరిగా, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయడం లేదని, ఒకవేళ చేసి ఉంటే కాన్వాయ్ బకాయిల బిల్లులు మరింత ఎక్కువగా ఉండేవన్నారు.

బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ సరే…
బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ వేయడం సరేనని, బెయిల్ రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేయడం అసాధారణమని, ఈ పిటిషన్ ను కోర్టు స్వీకరిస్తుందని తాను భావించడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఒకవేళ మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు స్వీకరిస్తే న్యాయం సగం చచ్చిపోయినట్టేనని ఆయన అన్నారు.. ఈ తరహా పిటిషన్ ను కోర్టు చీ కొట్టే అవకాశం ఉందని, కోర్టులు ఎన్నిసార్లు ఛీ కొట్టినా, కక్షలు కార్పణ్యాలు తమ ప్రభుత్వ పెద్దలకు తగ్గడం లేదన్నారు. వ్యవస్థలను ఈ విధంగా పాలకులు దుర్వినియోగం చేయాలని చూడడం బాధ అసహ్యం , కలుగుతోందన్నారు.

రింగు రోడ్డు లేదు…కేసా?
అమరావతిని చిదిమేసే ప్రయత్నంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణమే చేపట్టమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, అవుటర్ రింగ్ రోడ్డు లో అవినీతి జరిగిందని కేసు నమోదు చేయడం విస్మయాన్ని కలిగిస్తోందనీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఊహాజనితమైన, లేని రింగు రోడ్డు ద్వారా లబ్ధి పొందారని టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇవ్వాలని చూడడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు వేసిన పిటిషన్ దారు డి పై, కేసు నమోదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

Leave a Reply