Suryaa.co.in

Telangana

రాజీవ్ యువ వికాసం గేమ్ చేంజర్

– యువకుల జీవితాలు మారుతాయి, బ్యాంకర్లకు మంచి పేరు వస్తుంది
– జిల్లా స్థాయిలో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి
– రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశంలో
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకులతో ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం ఒక సాధారణ సంక్షేమ పథకం గా చూడవద్దని బ్యాంకర్లను కోరారు.

మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి పథకానికి రూపకల్పన చేసినట్టు వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి పథకాలకు ఏనాడు ఏ ప్రభుత్వం కేటాయింపులు చేయలేదని తెలిపారు. కొలువుల కోసం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలపాటు నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని అన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థికంగా సామాజికంగా రాష్ట్రంలోని యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు.

రాజీవ్ వికాసం ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది అన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొదలు కమిషనర్ల వరకు ఈ పథకం రూపకల్పన, ఎంపికైన వారికి శిక్షణ పై తీవ్ర కసరత్తు చేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది బ్యాంకర్లు 1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలి అన్నారు. ఈ పథకంలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా మీకు మంచి పేరు దక్కుతుందని, యువ వికాసం పథకం కింద లబ్ధి పొందే యువకులకు వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడం పైన అధికారులు కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇస్తారని, వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడితే శిక్షణ సంస్థలు మద్దతు ఇస్తాయని బ్యాంకర్లకు వివరించారు.

సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఎస్టి సంక్షేమ శాఖ సెక్రెటరీ శరత్, బీసీ సంక్షేమ శాఖ సెక్రెటరీ శ్రీధర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, అన్ని శాఖల బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE