Suryaa.co.in

Political News

ఇప్పటికి జరిగిన నాశనం చాలు

– రాయలసీమ ప్రజలారా ఆలోచించండి

చంద్రబాబుది రాయలసీమ కాదా? కోస్తా ఆడపడుచుని వివాహం చేసుకున్నంత మాత్రాన ఆయన రాయలసీమకు పరాయివాడు ఐపోతారా?
చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, రాయలసీమకు చేసినంత వేరే ఏ పార్టీ చేయలేదు.
మీరు కులం పక్కన పెట్టి రాష్ట్ర ఉనికి, క్షేమం గురించి ఆలోచించండి.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను మూడుముక్కలు చేయడానికి పునాదే, ఈ మూడు రాజధానులు .
మనమందరం కలిసి ఉండడం పక్కింటి ముక్కు.. చూడలేకపోతున్నాడు.
తెలంగాణాను విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ను చిన్న రాష్ట్రం చేసినా కళ్లు చల్లబడలేదు.
అద్భుత కోస్తా తీర ప్రాంతం, తిరుమల వెంకన్న, సింహాద్రి అప్పన్న, అందమైన వైజాగ్, సహజ వనరుల రతనాల సీమ, మనందరి కష్టపడే తత్వం, ఆ పెద్ద ముక్కోడికి, ఆ బిహారీ గాడికి, కంటగింపుగా ఉంది.
అన్ని కులాలలోనూ మంచి వారున్నారు చెడ్డ వారున్నారు.
కులం మన కుటుంబం వివాహాల వరకే పరిమితం.
అందరం తెలుగు వారం అనే ఒక్క భావన చాలు మనం ఐకమత్యంగా ఉండడానికి.
మనలో అసలు కులపిచ్చి లేదు.
అన్ని కులాలలో మనకు స్నేహితులు ఉండడమే దానికి ఋజువు.
లేని దాన్ని బీహారోడూ, కొన్ని పిచ్చి ఛానల్స్ సృష్టించారు.
ఒకసారి విడిపోయి నష్టపోయాం.

సారి మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ 3 ముక్కల విభజన ఖాయం.
కొద్ది మంది కపట రాజకీయ నాయకుల ధ్యేయమే అది.
మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గేయం రచించింది ఎవరు?
శంకరంబాడి సుందరాచారి ఏ ప్రాంతం వారు?
“”రాయలసీమ వాసి కాదా?””
ఆ గేయం తెలుగువారికి గర్వకారణం కాదా?
తాను రాయలసీమకు దత్తపుత్రుడినని చెప్ఫుకున్న అన్న NTRను మరిచారా?
“అందరం కలిసి ఐకమత్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు కాకుండా కాపాడుకోవలసిన తరుణం ఇది.”
చంద్రన్న కియా ఎక్కడ పెట్టారు? అనంతపురంలో కాదా?
IIT ఎక్కడ పెట్టారు? చిత్తూరులోనే కదా?
హీరో హోండా ఎక్కడ? చిత్తూరులో కాదా?
శ్రీసిటీలో చాలావరకూ సెల్ ఫోన్ కంపెనీలు పెట్టించారు.
ఇక వైజాగ్‌లో చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టారు.
IIIT ఎక్కడ? గోదావరి జిల్లాలో కాదా?
ఇదంతా అభివృద్ధి వికేంద్రీకరణ కాదా?

మరి అమరావతిలో ఏమి పెట్టారో ఆలోచించండి.
రాయలసీమ, ఉత్తరాంధ్ర సోదరులారా…
అక్కడ ఏ కంపెనీలు లేవు.
అమరావతి రాజధాని భవనాలు, ఉద్యోగుల నివాస భవనాలు, తప్ప ప్రైవేటు వారు విద్యాసంస్థలు పెట్టి ఉండవచ్చు.
రాజధాని కనుక వారు అక్కడే పెడతారు.. మనం వద్దంటే వారు ఇంకొక రాజధానికి వెళతారు.
మూడు రాజధానులంటే ఆ విద్యాసంస్థలు గందరగోళంలో పడతాయి.
ఇంకో రాష్ట్రానికి పోతారు. అసలు ఆంధ్రప్రదేశ్ కే విలువ ఉండదు
“ఐనా అమరావతి ప్రాంత ప్రజలు మా దగ్గర కంపెనీలు పెట్టకుండా వేరే ప్రాంతాలకు ఇచ్చాశారు అని బాధపడలేదు.”
ఎందుకు?
మనమందరం ఒకటే అంతా మన ప్రాంతమే అనుకున్నారు కనుక.

అమరావతి మనందరిదీ.
ఐదుకోట్ల ఆంధ్రులది అని గుర్తు పెట్టుకోండి
రైతులు భూమి ఇవ్వకపోతే మనకు ఇప్పటికి కూడా రాజధాని ఉండేది కాదు.
రైతన్నలు వారి జీవనాధారం, తరతరాల వారసత్వాన్ని మన ప్రజలకు ఇచ్చేశారు.
75% ప్రజలకు, 25% మాత్రమే రైతులది.
అది త్యాగం కాదా?
దాన్ని రియల్ ఎస్టేట్ అని కుత్సిత బుద్ధితో కొందరు నీచులూ నికృష్టులూ ఎందుకూ పనికి రాని వారూ రెచ్చగొడితే అందరూ నమ్మారు.
ఇప్పుడైనా నిజాలు తెలుసుకోండి…
అందరం కలిసి ఆంధ్రప్రదేశ్‌ను దళారుల నుండి, పక్క ముక్కోడి కుట్రలూ కుయుక్తుల నుండీ రక్షించుకుందాం.
రండి చేయి చేయి కలపండి.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా..
గతమెంతో ఘనకీర్తి కలవోడా
వీర రక్తపు ధార ధారపోసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా

గుర్తు తెచ్చుకోండి.
ఇప్పటికే యువత చాలా వరకు వలస పోయారు.
మనం మేలుకోకపోతే ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిగిలేది మధ్య వయస్కులు, వృద్ధులు మాత్రమే.

– రవీంద్ర

LEAVE A RESPONSE