జగన్ రెడ్డికి తెలిసే ఎర్రచందనం స్మగ్లింగ్

• రాయలసీమ కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకున్నది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వారి అనుచరులే
• చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డికి తెలియకుండా ఎవరూ ఒక్క ఎర్రచందనం చెట్టుని కూడా నరకలేరు
• అన్నమయ్య జిల్లాలో పోలీసుల్ని ఢీకొట్టి పారిపోయిన బొలేరో వాహనం వైసీపీ నాయకుడు గజ్జల శ్రీనివాసరెడ్డిదని అక్కడి ప్రజలకు బాగా తెలుసు
• ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల్ని వాహనంతో ఢీకొట్టి పారిపోయినా, ఒక కానిస్టేబుల్ మరణించినా డీజీపీలో చలనం లేదు
• మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులే ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ లో మునిగి తేలుతున్నారు
• ఎర్రచందనం కొల్లగొట్టడం ద్వారా వచ్చే సొమ్ముతోనే వచ్చేఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి జగన్ రెడ్డి ప్రణాళికలు రచించాడు
• ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చే సొమ్ముని విజయానందరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల ద్వారా జగన్ రెడ్డికి చేరవేస్తాడు
• నమ్మకంగా ఎప్పటికప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్ము ఇస్తున్నాడనే విజయానందరెడ్డికి జగన్ రెడ్డి చిత్తూరు సీటు ఇచ్చాడు
– టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని, జగన్ రెడ్డి పాలనలో పోలీసుల సహాయ సహకారాలతో దోపిడీలు.. దౌర్జన్యాలు.. స్మగ్లింగ్ జరుగుతు న్నాయని, అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద అధికారపార్టీకి చెందిన స్మగ్లర్లు బొలేరో వాహనంతో తమను అడ్డుకున్న పోలీసుల్ని వాహనంతో గుద్దేసి పారిపోయారని, ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలైతే, గణేశ్ అనే కానిస్టేబుల్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, ఇంత దారుణం జరిగినా అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర డీజీపీ స్పందించకపోవడాన్ని దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ నలుగురు పోలీసుల్ని గుద్దేసిన వ్యక్తుల్ని, వాహనాన్ని సాటి పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదంటే ఏమనాలి? ఒక కానిస్టేబుల్ మరణానికి కారణమైన ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకోలేని దుస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలే ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతంలోని ఎర్ర చందనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీ పీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ విజయానంద రెడ్డే దోచేస్తున్నారు.

వారి కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లర్లు విలువైన ప్రకృతి సంపదను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని ఎర్రచందనాన్ని కాపాడుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో పోటీచేసే వైసీపీ అభ్యర్థులు ఎవరినీ సీమ ప్రజలు గెలిపించకూడదు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు గెలిచినా, ఎర్రచందనం స్మగ్లింగ్ కు ప్రజలు తమకు లైసెన్స్ ఇచ్చారనే వారంతా భావిస్తారు.

ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల్ని చంపి మరీ తప్పించుకున్న ఘటనపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి పోలీసుల్ని ఢీకొట్టిన వాహనం వైసీపీ జడ్పీటీసీ భర్త గజ్జల శ్రీనివాసరెడ్డిదని పోలీసులకు తెలియదా?
ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై హత్యాయత్నం చేసి తప్పించుకున్న ఘటనపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి. పోలీసుల్ని ఢీకొట్టిన బొలేరో వాహనం చిత్తూరు జిల్లాలోని కేవీపల్లి వైసీపీ జడ్పీటీసీ భర్త గజ్జల శ్రీనివాసరెడ్డిదని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. వాహనం ఎవరిదో తెలిసినా పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేపట్టలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే స్మగ్లింగ్ లో భాగంగా జరిగిన ఈ దుస్సంఘటనపై లోతైన విచారణ జరిపించి, ఎర్రచందనం అక్రమార్కుల్ని కఠినంగా శిక్షిస్తాం.

స్మగ్లర్ల దాడిలో మరణించిన కానిస్టేబుల్ కురవ గణేశ్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి ఆదుకోవాలి. ఎర్రచందనం స్మగ్లర్లను కట్టడి చేయడానికి నియమించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందానికి ప్రత్యేకాధికారిగా నిన్నటివరకు చిత్తూరు జిల్లాఎస్పీగా పనిచేసిన రిషాంత్ రెడ్డిని నియమించారు. ఆయన అక్కడే ఉంటూ కూడా ఎర్రచం దనం స్మగ్లర్లను కట్టడిచేయలేకపోయాడంటే ఏమనాలి?

ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కొల్లగొట్టిన సొమ్ముతోనే వచ్చేఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల్ని గెలపించాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు
ఉమ్మడికడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం కొల్లగొట్టడం ద్వారా వచ్చే డబ్బుతో కోటీశ్వరులైన వారినే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాడు. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా జగన్ నియమించిన విజయానందరెడ్డిపై అనేక కేసులున్నాయి. అతని నేరచరిత్ర స్థానిక ప్రజలకు బాగా తెలుసు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరులైన కూరపర్తి మహేందర్ రెడ్డి (ఈయన భార్య చినగొట్టిపల్లి మండల వైసీపీ జడ్పీటీసీ), చీకంపల్లి నాగేశ్వర్ రెడ్డి, గజ్జల శ్రీనివాసరెడ్డిల నాయకత్వంలోనే ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాల్లో ఎర్రచందనం దోపిడీ జరుగుతోంది.

ఆ రెండు జిల్లాల్లో ఎక్కడ ఎవరు ఎర్రచందనం చెట్లు కొట్టినా, ఆ దుంగలు చివరికి విజయానందరెడ్డి వద్దకే చేరాలి. ఆయనే ఎర్రచందనం దుంగలు కొని, విదేశాలకు తరలిస్తుంటారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బుని విజయానందరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల ద్వారా జగన్ రెడ్డికి చేరవేస్తున్నాడు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డబ్బులు ఖర్చుపెట్టాలనే నిబంధన ప్రకారమే జగన్ రెడ్డి, చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా విజయానంద రెడ్డిని నియమించాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే కొందరు వైసీపీ అభ్యర్థులకు విజయానందరెడ్డి డబ్బు సమకూర్చాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

తమ ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకున్న పోలీసుల్ని చంపేందుకు కూడా వైసీపీ స్మగ్లర్లు వెనుకాడటం లేదంటే, ఇక వారిని అడ్డుకునేది ఎవరో ప్రజలే ఆలోచించాలి
దోపిడీలు, దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడే వారినే జగన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులుగా ప్రకటిస్తూ, ఎస్సీలు, బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నానంటూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం హయాంలో ఎర్రచందనం చెట్లను చంద్రబాబు కంటికి రెప్పలా కాపాడితే నేడు ఎర్రచందనం చెట్టు కంటికి కనిపించకుండా వైసీపీ నేతలు కొల్లగొట్టేస్తున్నారు. తమ స్మగ్లింగ్ కు అడ్డొచ్చిన వారిని ఏమాత్రం ఆలో చించకుండా అంతమెందిస్తున్నారు.

వైసీపీ నేతల స్మగ్లింగ్ కు ఎవరు అడ్డొచ్చినా సరే క్రూరంగా చంపేస్తున్నారు. ఎర్రచందనం మాఫియాకు అడ్డొచ్చారని పోలీసు ల్నే చంపేస్తున్నారంటే ఇక వైసీపీ నేతల స్మగ్లింగ్ మాఫియాను అడ్డుకునే దెవరు? ప్రకృతి సంపదకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేది ఎవరు? గన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి అండదండలతోనే రాయలసీమలో ఎర్రచందనం మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ నేతలు మూడున్నరేళ్లలో రూ. 10 లక్షల కోట్ల విలువైన 3 లక్షల టన్నుల ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించారు.

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి కనుసన్నల్లో చిత్తూరు జిల్లాపరిధిలోని శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం సముద్ర మార్గాన విదేశాలకు తరలిపోతోంది. ఎర్రచందనం స్మగ్లర్లకు అవసరమైన డబ్బు, మనుషుల్ని, వాహనాల్ని సమకూర్చేది వైసీపీనేతలే. వైసీపీ నేతల కనుసన్నల్లో నిత్యం టన్నుల కొద్దీ ఎర్రచందనం స్మగ్గింగ్ చేస్తున్నా పోలీస్ వ్యవస్థ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఎన్నికేసులు నమోదు అయ్యాయో, ఎందరిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపారో డీజీపీ చెప్పాలి
గతంలో చిన్నాచితకా స్మగర్లుగా ఉన్నవాళ్లు జగన్ అధికారంలోకి రాగానే బడా స్మగర్లుగా మారారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి పదవులు చేపట్టారు. మరికొందరు నామినేటెడ్ పదవులు చేపట్టారు. ఆ కోవలోనే వైసీపీ ప్రభుత్వం విజయానందరెడ్డికి ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. పోలీస్ మరియు ఆటవీశాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని తమ కనుసన్నల్లో ఉంచుకున్న వైసీపీ ఎర్రచందనం స్మగ్లర్లు నిత్యం వేలటన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు.

గతంలో తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం స్థానిక వైసీపీ నాయకులే బడా స్మగర్లుగా మారారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ప్పటినుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎన్ని కేసులు నమోదయ్యాయో, ఎంతమందిని అరెస్ట్ చేసి, జైళ్లకు పంపించారో డీజీపీ బహిర్గతం చేయాలి.” అని రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు

Leave a Reply