Home » తెలంగాణలో విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

తెలంగాణలో విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2024-25 విద్యాసంవ‌త్స‌ రానికి సంబంధించిన క్యాలెండ‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు ప‌దో త‌ర‌గ‌తి ప్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ను న్నారు. 2025 మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 2 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు, డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు, జ‌న‌వ‌రి 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. ఉన్న‌త పాఠ‌శాల‌లు ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంట‌ల వ‌ర‌కు, అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్స్ ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

Leave a Reply