Home » గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు

గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు

17 మంది దుర్మరణం

చత్తీస్ ఘడ్: ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూ లింది. దాంతో పరిశ్రమలో పనిచే స్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకు న్నారు. ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply