Home » ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి

ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి

– వైఎస్ భారతి, విజయసాయి రెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున ముఠా భూములను చేజిక్కిచుకొన్నాయి
– జవహర్ రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి
– అసైన్డ్ భూములపై జవహర్ రెడ్డి కన్నేశారు
– జవహర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596
– ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్
– అసైన్డ్ భూములు కొట్టేసిన వైసీపీ నేతలు, ఐ ఏ ఎస్ లపై సీబీఐ విచారణ జరపాలి
– జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్

రోమ్ నగరం తగల పడి పోతుంటే ఫిడేల్ వాయించినట్టు..రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ఒ క పక్క ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే, విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారు. మరో వైపు భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు సమీక్ష జరిపారు.

వాటి రిజిస్ర్టేషన్ల కోసం నాలుగు రోజుల క్రితం విశాఖ వచ్చి భోగాపురం సమీక్ష అని బిల్డప్. జగనన్న పేదల ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి విశాఖలోనే రెండు వేల కోట్ల భూములు కొట్టేస్తే మిగిలిన చోట్ల ఇంకెంతో? దేశంలో సివిల్ సర్వెంట్లు నిర్ఝాంతపోయేలా…రాజకీయ నేతలు షాక్ కు గురయ్యేలా… వేల కోట్ల భూ కుంభకోణానికి నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. కె.ఎస్. జవహర్ రెడ్డి తెరలేపారు,

ఇఫ్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన 400 ఎకరాల ఎస్ .సి, బి. సి ల అస్సైన్డ్ భూములను, కుమారుడిని అడ్డంపెట్టి బినామీల పేరిట చేజిక్కిచుంకున్నారు. మరో 400 ఎకరాలకుపైగా భూములను, ఆఘమేఘాల మీద రిజిస్ర్టేషన్ చేయించేందుకు యుద్ధప్రతిపదికన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

పోలింగ్ అనంతర హింసతో అట్టుడికిపోతూ కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ తరుణంలో జవహర్ రెడ్డి అవేవీ తనకు పట్టనట్టు విశాఖ వచ్చి, అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్ల వ్యవహరాన్ని సమీక్షించి మరింత వేగంగా పనిపూర్తి అయ్యేలా తన అధికారంతో జీ వో 596 ను అడ్డం పెట్టుకొని క్రింది స్ధాయి వారిపై ఒత్తిడి తీసుకు వచ్చారు.

నా ఎస్.సీ లు, నా బీ.సీ లు, నా ఎస్.టీ లు అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వారిపై కపట ప్రేమను చూపించారు. ఆ సమయంలోనే వారి చేతుల్లో వున్న కొద్దిపాటి అసైన్డ్ భూములను భూ స్వాములు,రాజకీయనేతలు, అవినీతి అధికారుల పరం చేసే జీ.వొ 596 విడుదల చేశారు.

ఆ జి వో ప్రకారం అసైన్డ్ భూములను వారి వారసులకు,అనుభవదారులకు ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ జారీ చేసి భూమి పై సర్వ హక్కులు కల్పించారు. అంటే సర్టిఫికేట్ జారీ అయితే భూములను 22ఎ నుంచి తప్పిస్తారు. ఈ మేరకు సెక్షన్ 35 ఆఫ్ 2023 పేరిట చట్టం చేశారు. దీంతో ఇస్టానుసారం గా అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు.

దీనినే ఆసరగా చేసుకొని జీ వో రాకముందే అసైన్డ్ భూములు ఎక్కువగా వున్న విశాఖ,విజయనగరం జిల్లాలపై కన్ను వేసి కుమారుడినే రంగంలోకి దింపారు. సుపుత్రుడు ఒక ముఠాను రంగంలోకి దింపి బెదిరించి ,భయపెట్టి తక్కవకు ఐదు,పది లక్షల రూపాయలకే ఎకరా చొప్పున కొన్ని వందల ఎకరాలకు అగ్రిమెంట్లు చేసుకొన్నారు.

బహిరంగ మార్కెట్ లో ఎకరా రెండు కోట్లు కు పైగా ఉన్న చోట కూడా, ఎకరా ఐదారు లక్షలకే జవహర్ ముఠా ఒప్పందాలు చేసుకొని అడ్వాన్సులు ముట్టజెప్పింది. వైసీపీ ప్రభుత్వం రాదన్న భయంతో హడావుడిగా రిజిస్ట్రేషన్లు.

పోలింగ్ వరకూ ఈ భూముల గురించి పెద్దగా పట్టించుకోని జవహార్ రెడ్డి ముఠా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ విదేశీయానానికి వెళ్లగానే మరే ఏ పని లేనట్టు పూర్తిగా వీటి రిజిస్ర్టేషన్ల పైనే వున్నారు. వారం పది రోజుల్లో కౌంటింగ్ కు నాలుగు రోజుల ముందే ఈ భూముల రిజిస్ట్రేషన్ పూర్తిచేసేందుకు విశాఖ , విజయనగరం అధికారులపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చి అర్ధరాత్రి వరకూ పనులు చేయిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం తిరిగి రాకపోతే తనను వెంటనే పదవిలోనుంచి తప్పించే ప్రమాదం ఉందని గ్రహించిన జవహర్ రెడ్డి రాష్ట్ర పాలనను పక్కన పెట్టి, అమరావతినుంచి ఈ వ్యవహారాలను సమీక్షించడం మీదే సమయం వెచ్చిస్తున్నారు.

భోగాపురం విమానాశ్రయం కేంద్రంగా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ వందల ఎకరాల్లో వున్న అసైన్డ్ భూములపై జవహర్ రెడ్డి కన్నేశారు. విమానాశ్రయం ఏడాదిలో పూర్తి కానుంన్నందున ఆ చుట్టు పక్కల భూములకు మంచి డిమాండు వుంటుందన్న భావనతో వాటిని చేజిక్కించుకొన్నారు.

భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలో వున్న విజయనగరం జిల్లా పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, నాతవలసలలో పెద్ద సంఖ్యలో భూములు రిజిస్ర్టేషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి.

వీటితో పాటు విశాఖ జిల్లా పరిధిలోని అత్యంత విలువైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో వందలాది ఎకరాలను జవహార్ రెడ్డి టీం చేజిక్కించుకొంది.

గుడిలోవ,గండిగుండం, తర్లువాడ,గిరజాల,రామవరం,రావాడ, రావివలస, ముక్కాం, సవరవల్లి, తూడెం, బీ టీ కల్లాలు,భీమ ధొరపాలెం, ఐనాడ కనమాం తదితర గ్రామాల్లో జవహార్ రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.

వైసీపీ నేతలు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముఠా, మంత్రి మేరుగు నాగార్జున ముఠా, సీఎం సతీమణి వైఎస్ భారతి పేరిట ఒక ముఠా ఈ ప్రాంతాల్లో భూములను చేజిక్కిచుకొన్నాయి. ఈ ముఠాలను తాజాగా జవహర్రెడ్డి ముఠా డామినేట్ చేసింది. అప్పుడు వీరు అడ్వాన్సులు ఇచ్చిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయి.

విజయసాయి రెడ్డి,మంత్రి నాగార్జున నుంచి జవహర్ రెడ్డి వరకూ ఎంతో మంది అధికార పెత్తనంతో దళితులను బి. సి లను భయపెట్టి భూములు కాజేశారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని అక్రమంగా, అన్యాయంగా జరుగుతున్న అసైన్డ్ భూములు రిజిస్ర్టేషన్లు నిలిపి వేయాలని కోరుతున్నాం. మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. వేల కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసిన వైసీపీ నేతలు, ఐ ఏ ఎస్ లపై సీబీఐ విచారణ జరపాలి.

Leave a Reply