Suryaa.co.in

Andhra Pradesh

రిలీజ్ ద కంటైనర్!

– ఆ కంటైనర్ లో ఉన్నది డ్రగ్స్ కాదు.. డ్రై ఈస్ట్ మాత్రమే
– సీబీఐ క్లీన్ చిట్
– కంటైనర్ ను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
– ఎన్నికల ముందు అది డ్రగ్స్ కంటైనరేనని వైసీపీ-కూటమి ఆరోపణల వర్షం

విశాఖ: పోర్ట్ కు వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా డ్రగ్స్ దిగుమతి అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో.. కస్టమ్స్ ఆ కంటైనర్ ను సీజ్ వేయడం, సీబీఐకేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఆ కంటైనర్ లో ఉన్నది డ్రగ్స్ కాదని, డ్రై ఈస్ట్ మాత్రమేనని సీబీఐ క్లీన్ చిట్ ఇస్తూ… గత జూలై లోనే కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ను సమర్పించేసిందట. సీబీఐ క్లోజర్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకొన్న కోర్ట్ కేసును మూసివేసింది.

ఈ నేపథ్యంలో… గతంలో సీజ్ చేసిన కంటైనర్ ను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల ముందు ఈ కంటైనర్ కలకలం రేపిన విషయం తెలిసిందే. అది వైసీపీ నాయకులదేనని కూటమి నేతలు ఆరోపించగా, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమీప బంధువుదేనని వైసీపీ ప్రత్యారోపణ చేసింది. వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌ను ఏపీకి తరలించి, అక్కడి నుంచి దేశం మొత్తానికి రవాణా చేయాలన్న కుట్రతోనే, ఆ కంటైనర్ తెప్పించారని పరస్పరం ఆరోపించుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఆ కంటైనర్ ముచ్చటే వినిపించలేదు.

LEAVE A RESPONSE