బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో రిప‌బ్లిక్ డే వేడుక‌లు

73 వ గణతంత్ర దినోత్సవాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నేడు ఘనంగా ఎంతో ఉత్సాహంతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేటి ఉదయం హాస్పిటల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు జండా ఎగురవేసి జాతీయ గీలాపన చేశారు.

అనంతరం కార్యక్రమానికి హాజరైన వైద్యులు, సిబ్బంది, రోగులు మరియు ఇతరులను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఎందరో మహాను భావుల కృషి, సేవా భావం కారణంగా మనకు స్వాతంత్ర్యం సిద్దించిందని అన్నారు. శ్రీ బాబా సాహేబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించబడిన
balayya1 రాజ్యాంగంతో సర్వ సత్తాక గణతంత్రం అవతరించిన మన దేశం గత ఏడు దశాబ్దాల కాలంలో అగ్రగామి ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్ర్యం సిద్దించే నాటికి ఎన్నో సమస్యల వలయంలో ఉన్న మన దేశానికి డా. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒక దిక్సూచిలా నిలిచి దిశానిర్దేశం చేసిందన్నారు. మన ప్రభుత్వాలు శరీరాలైతే దాని ఆత్మ రాజ్యాంగమని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగం అమలులోనికి వచ్చిన నాటినే నేడు మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకొంటున్నామని వివరించారు.

స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానుభావులను స్మరించుకోవాల్సిన సమయమిదని, అదే సేవా భావంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ సంస్థ ఎందరో క్యాన్సర్ రోగులకు ప్రాణాలందించిందిని అన్నారు. ఇటీవల NITI Aayog మన ఆసుపత్రిని స్టడీ చేసి భారతదేశం లోనే అత్యుత్తమ లాభాపేక్షలేని ట్రస్ట్ హాస్పటల్ గా గుర్తించడం సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా ఈ ఒక్క డాక్టర్ కానీ ఆసుపత్రి సిబ్బంది కానీ ఎలాంటి భయానికి లోనుకాకుండా ఎంతో నిబద్దతతో క్యాన్సర్ రోగులకు చికిత్సను అందిస్తున్నారని అంటూ వారికి ప్రత్యేకంగా ప్రశంసలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణతో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణికోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. సెంథిల్ రాజప్ప, హెడ్, మెడికల్ ఆంకాలజీ, BIACH&RI పాటు మెడికల్ విభాగాధిపతులు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply