– చెప్పు దెబ్బకి రేవంత్ రెడ్డి సిద్ధమా?
– ఇంకోసారి కేసీఆర్, హరీష్ రావు నీటి జలాల వాటాల సంతకాలు పెట్టారు అంటే చెప్పుతో కొడతా
– రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇచ్చేది వాటరా? నీళ్లా ?
– పదవుల కోసం,పైసల కోసం అమ్ముడుపోయిన చరిత్ర నీది
– నీళ్ల శాఖ మంత్రికి జ్ఞానం లేదు
– శవాలను బయటకు తీయలేని వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ఇంకోసారి కేసీఆర్, హరీష్ రావు నీటి జలాల వాటాల సంతకాలు పెట్టారు అంటే చెప్పుతో కొడతాను. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పైలెట్లతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన వాళ్ళని పట్టుకొచ్చి సర్వేలు చేస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డికి చంచల్ గూడ జైలులో జేబు దొంగల పరిచయాలు ఉన్నాయి కాబట్టి దొంగతనాలు చేయిస్తున్నాడా? కోమటిరెడ్డికి వాటర్ లో నీళ్ళు కలుపుకునే పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ పని కానిస్తున్నాడు. శవాలు తీసే వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకొక పోయారా? ఆ టన్నెల్ లోపల ఉన్న శవాలు తీసే వాళ్ళు!
సీఎం రేవంత్ రెడ్డి,నల్గొండ జిల్లా మంత్రులు హెలికాప్టర్ సర్వే చేశారు. రాజకీయ నాయకులు టెక్నికల్ సర్వే చేయడం మొదటిసారి. కెప్టెన్ హెలికాప్టర్ నడిపించారు. వాటర్ లో నీళ్లు కలిపే మంత్రి సర్వే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడారు.
ఎస్.ఎల్.బి.సి విషయంలో కాంగ్రెస్,టీడీపీ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగింది. దత్తత పేరుతో సమైక్య పాలకులు కోతలు కోశారు. నీళ్ల శాఖ మంత్రికి జ్ఞానం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్లు అంటే భయం. ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. 2013 లో ఉమ్మడి ఏపీలో కృష్ణా నది జలాల కేటాయింపులు జరిగాయి. తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారు.
కేసీఆర్,హరీష్ రావు సంతకం పెట్టారని రేవంత్ రెడ్డి అంటున్నారు. చెప్పు దెబ్బకి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? కేసీఆర్ సీఎం అయ్యాక కృష్ణా జలాల వాటా కోసం కమిషన్ వేయించారు. ఎస్.ఎల్.బి.సి లో శవాలను బయటకు తీయలేని వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సర్వే చేయకుండా కమీషన్ల కోసం ఎస్.ఎల్.బి.సి పనులు చేశారు
జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎస్.ఎల్.బి.సి పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. నల్గొండ జిల్లాలో ఇద్దరు మొనగాళ్ళు మంత్రులుగా ఉన్నారు. కృష్ణా నదిలో 500 టీఎంసీలు తెలంగాణకు తేకుండా రెండు ఏళ్ళుగా ఏం చేస్తున్నారు?
తెలంగాణ నీళ్లను గురుదక్షిణ కింద చంద్రబాబుకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు?శక్తికి మించిన పదవి రేవంత్ రెడ్డికి వచ్చింది.
భీమా,కల్వకుర్తి,నెట్టెంపాడు, కోయిల్ సాగర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి పాత గురువు చంద్రబాబు, కొత్త గురువు కాంగ్రెస్ నిర్వాకంతోనే పాలమూరుకు నీళ్లు రాలేదు. పదవుల కోసం,పైసల కోసం అమ్ముడుపోయిన చరిత్ర నీది. ఉమ్మడి ఏపీలో బీఫామ్ ల కోసం, తెలంగాణలో పదవి కాపాడుకోవడం కోసం మోడీతో మిలాఖత్ అయ్యారు.
చంచల్ గూడ, చర్లపల్లి జైల్లో ఉన్న పరిచయాలతో తెలంగాణ ప్రజల జేబును కొడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిచయం లేకపోతే సర్వే చేసేవాళ్ళు కాదా?ఎస్.ఎల్.బి.సి లో చిక్కుకున్న శవాలను బయటకు తీసే వాళ్ళు పరిచయం లేరా? బస్సు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పోలేదు? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
ఎస్.ఎల్.బి.సి ని కమీషన్ల కోసమే కాంగ్రెస్ మొదలుపెట్టిందా? రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇచ్చేది వాటరా? నీళ్లా ? సన్న ధాన్యంకు గైడ్ లైన్స్ రాలేదని ప్రభుత్వం అంటోంది. రైతులు దళారులకు పంటను అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. ప్రయివేటు కళాశాలలు బంద్. మరోవైపు పత్తి మిల్లులు బంద్. సీఎం,మంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారు. సీఎం ఢిల్లీలో, మంత్రులు జల్సాల్లో వున్నారు.
ముఖ్యమంత్రి,మంత్రులకు పంచాయతీ తప్ప ఏం చేయడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తోంది. రాష్ట్రంలో 50 శాతం క్రైమ్ రేట్ పెరిగింది.
సర్వేలు చాలామంది చేస్తారు. సర్వేలతో బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఒక్క పధకం ఆపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం. రేవంత్ రెడ్డి ఏ పధకాలు రద్దు చేస్తారో చూదాం. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్ , భూపాల్ రెడ్డి , రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.