Suryaa.co.in

Telangana

లిఫ్ట్ లో రేవంత్ రెడ్డికి త‌ప్పిన‌ ప్ర‌మాదం

హైదరాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. నోవాటెల్‌లో సీఎం ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్ప‌డింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో మొరాయించింది. ఓవర్ వెయిట్ కార‌ణంగా ఉండాల్సిన ఎత్తుకంటే లిఫ్ట్ కిందికి దిగింది. దీంతో అధికారులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమ‌య్యారు. వెంట‌నే లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎంను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువచ్చారు. సీఎంను అధికారులు వేరే లిఫ్ట్ లో పంపారు.

LEAVE A RESPONSE