Suryaa.co.in

Andhra Pradesh

చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం…

– రాజవోలు గ్రామంలో హై స్కూల్ నందు బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం: విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులు క్రీడా రంగంలో బాగా రాణించాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రాజవోలు గ్రామంలో స్థానిక హై స్కూల్ నందు కీ. శే గోరంట్ల శాంతారాం వారి జ్ఞాపకార్థం జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2లక్షల 50వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన బాస్కెట్ బాల్ కోర్టును రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ తో కలిసి ప్రారంభించారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అనేక నూతన విషయాలు తెలుసుకోవాలని, తమ సోదరుడు కీ. శే గోరంట్ల శాంతారాం పేరుతో వారి కుమారుడు గోరంట్ల రవి రామ్ కిరణ్ బాస్కెట్ బాల్ కోర్టును చాలా సుందర వనంగా తీర్చిదిద్దారని తెలిపారు.

పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ తమ పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని, ఈ ప్రాంగణంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు జరిగే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గోరంట్లను కోరారు. అలాగే అడిగిన వెంటనే తమ సొంత నిధులు కేటాయించి బాస్కెట్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేసిన డాక్టర్ గోరంట్ల రవిరాం కిరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవ్, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, స్కూల్ హెచ్ఎం పి.రమాదేవి, నిమ్మలపూడి రామకృష్ణ, కురుకూరి కిషోర్, వల్లేపల్లి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకటరావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE