Suryaa.co.in

Telangana

ఇవిగో కేసీఆర్ ఆనవాళ్లు!

– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బాన్సువాడ: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని చెప్పడానికి ఇదిగో ఆనవాళ్లు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యాం ను ఆమె సందర్శించారు. మండు వేసవి లోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యాం కేసీఆర్ తెలంగాణ ను పచ్చబడేయడానికి పడ్డ తపనను గుర్తు చేస్తుందన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో మంజీరా నదిపై ఇలాంటి నాలుగు చెక్ డ్యాంలు నిర్మించి రైతులు వాన కోసం ఎదురు చూడకుండా పంటలు పండించుకునేలా కేసీఆర్ గారు చేశారన్నారు. ఈ ఒక్క చెక్ డ్యాం పై ఆధారపడి 1600 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు.

LEAVE A RESPONSE