Home » ముందు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి

ముందు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నాడు
ఓటుకు నోటుకు కేసులో 50 లక్షల రూపాయలపై ఇంత వరకు క్లారిటీ లేదు
బీ ఆర్ ఎస్ నేత గట్టు రామచంద్రరావు

కాంగ్రెస్ జన జాతర సభ తుస్సు మన్నది. రాహుల్ గాంధీని పిలుపించుకుని రేవంత్ రెడ్డి రెచ్చి పోయాడు తప్ప అందులో ఏమి లేదు. 10 యేండ్లలో లేని ప్రేమ ఇవ్వాళ తెలంగాణ పై రాహుల్ గాంధీకి వచ్చింది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు జై తెలంగాణ అనాలని రాహూల్ గాంధీ గుర్తు చేసి వెళ్ళాడు.

మోడీతో సంబంధాలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి…. రాహుల్ గాంధీ పరువు తీశాడు. పార్టీ పిరాయింపు పై చట్టం తెస్తాం అని రాహుల్ గాంధీ అంటుంటే….. రేవంత్ రెడ్డి ఏమో పార్టీ పిరాయింపు చేసిన వ్యక్తులను స్టేజి పైన కూర్చోబెట్టాడు. కేసీఆర్ ని కాదు జైల్లో పెట్టేది…. ముందు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి. ఓటుకు నోటుకు కేసులో 50లక్షల రూపాయలు ఎక్కడి నుండి తెచ్చాడో ఇంత వరకు క్లారిటీ లేదు.

ముఖ్యమంత్రి పదవి పోయిన తరువాత ముందు జైలుకు వెళ్లేది రేవంత్ రెడ్డి. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ సరిగ్గా అమలు చెయ్యడం లేదు. రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్ళు లేవని చెప్పిన వాళ్లు ఇవ్వాళ నీళ్ళు ఎలా ఇచ్చారో చెప్పాలి. ఇవ్వాళ రైతు ఆత్మహత్యలు ఎక్కువ అయినాయి. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .

ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజుల్లోనే 6 గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్ లోకి వచ్చారు. ఆరోజు కేసీఆర్ అనుకుంటే మీ ప్రభుత్వం ఉండేది కాదు. ప్రజల ఎన్నుకున్నారు 5 యేండ్లు వాళ్ళనే పాలన చెయ్యనిద్దామని కేసీఆర్ చెప్పారు. కవిత అరెస్ట్ సరైందే అంటారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తారు.

Leave a Reply