Home » ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?

ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?

-రిజర్వేషన్లపై రాహుల్‌ చెప్పిన మాటనే రేవంత్‌ చెబుతున్నారు
-కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని భారత్‌ జూడో యాత్ర ద్వారా రాహుల్‌ చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతు న్నారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలుస్తారా? మీరు పిలిస్తే భయపడతాం అనుకుంటున్నారా? రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి గుండెలు ఎదురొడ్డి నిలిచిన కాంగ్రెస్‌ శ్రేణులు ఢిల్లీ పోలీసులకు భయపడతాయా అని ప్రశ్నించారు. కాలం చెల్లిన థర్మల్‌ పవర్‌ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెచ్చి వెలుగులు పూయిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది. బొగ్గు బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికే చెందేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్తగూడెంలో స్పాంజ్‌ ఐరన్‌ ఫ్యాక్టరీ తెరిపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తెలిపారు.

Leave a Reply