Home » పశ్చిమకు నేనే ముఠామేస్త్రిని

పశ్చిమకు నేనే ముఠామేస్త్రిని

-సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా కల్పిస్తాం
-ముఠా కార్మికులకు బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి భరోసా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర ఉన్న వస్త్ర లతను సుజనా సందర్శించారు. ముఠా కార్మిక నాయకుడు చీపుళ్ళ సత్యనారాయణ, ముఠా కార్మికులు ఆయనకు స్వాగతం పలికారు. కార్మికులతో మమేకమై వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ముఠా కార్మికు లు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ ముఠా కార్మికుల సంక్షేమాన్ని జగన్‌ ప్రభుత్వం విస్మరించిందని, విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ముఠా కార్మికుల కోసం విశ్రాంతి భవనాన్ని మరుగుదొడ్లను నిర్మించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని, ముఠా కార్మికుల సంక్షేమాన్ని వెల్లంపల్లి తుంగలో తొక్కి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారని మండిపడ్డారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద అవగాహన కల్పించి అమలు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్మికుల పిల్లల ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రచారంలో భాగంగా ఐరన్‌ యార్డ్‌ కృష్ణవేణి మార్కెట్‌ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నారు. ముఠా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య వైద్యం మౌలిక సదుపాయా లను మెరుగుపరుస్తానని వివరించారు. పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షే మం లక్ష్యంగా పనిచేస్తానని కార్మికులందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా మాట్లాడుతూ సుజనాను గెలిపించుకుంటే పశ్చిమ నియోజక వర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ తాడి శకుంతల, బీజేపీ సీనియర్‌ నాయకులు పైలా సోమి నాయుడు, టీడీపీ కార్పొరేటర్‌ ఉమ్మడి చంటి, ఓబీసీ జనరల్‌ సెక్రటరీ కిలారి శ్రీనివాస్‌, బేవర శ్రీను పిళ్ల కృష్ణప్రసాద్‌, భారీ సంఖ్యలో ముఠా కార్మికులు హాజరయ్యారు.

Leave a Reply