Suryaa.co.in

Telangana

రేవంత్ యుద్ధం చేయాల్సింది బాబుతో.. బీఆర్‌ఎస్‌పై కాదు

– బాబును సమర్ధిస్తున్న కాంగ్రెస్, బీజేపీ
– స్పీకర్‌పై ఫిర్యాదు చేస్తాం
– ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

హైదరాబాద్ : తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఉంది.కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ ఏకమై బిఆర్ఎస్ పార్టీపైన దాడి చేస్తున్నాయి.తెలంగాణ ప్రజలపైన,నీళ్లపైన దాడి జరుగుతోంది.తెలంగాణ రాష్ట్రం పట్ల చంద్రబాబు నాయుడు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు నాయుడు,శిష్యుడు రేవంత్ రెడ్డి అబద్దాల్లో పెద్దన్నలుగా మారారు.

నేను తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్తున్నారు.చంద్రబాబు నాయడు వయసులో పెద్దవారు,వారు అంటే మాకు గౌరవం ఉంది.ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు.

చంద్రబాబునాయుడు మాటలకు,చేతలకు సంబంధం ఉండదు. కాంగ్రెస్,బీజేపీలు చంద్రబాబు నాయుడును సమర్ధించేవిధంగా మాట్లాడుతున్నాయి.తెలంగాణ సమస్యలు,నీళ్ల గురించి కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదు. తెలంగాణలో నీళ్ల అంశం బిఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టినవిద్య. అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా బిఆర్ఎస్ రెడీగా ఉంటుంది. అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోవద్దు.

తెలంగాణ,ఏపీ అసెంబ్లీలు కలిపి పెట్టినా నీళ్ల గురించి వాళ్లకు అవగాహన కల్పిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబునాయుడుకు లబ్ది జరిగేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను వాడుకుంటే మన హక్కులు అడగాలి కదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని పునర్విభజన చట్టంలో ఉంది.బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు కేంద్రం రెడీ అయింది.

సీఎం రేవంత్ రెడ్డితో బనకచర్ల విషయంలో కలిసినడవడానికి బిఆర్ఎస్ సిద్ధంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబునాయడుపై యుద్ధం చేయాల్సింది. బిఆర్ఎస్ పార్టీపై యుద్ధం చేస్తున్నారు.రేవంత్ రెడ్డి తనకుర్చీ కాపాడుకునేందుకు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చామల కిరణ్ కుమార్ రెడ్డి దేనికోసం బట్టలు విప్పుతారు అంట?తెలంగాణ అభివృద్ధి అంశాలపై ఒక్కసారి చామల కిరణ్ కుమార్రెడ్డి ఒక్కసారి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ బూతులు మాట్లాడాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

గురుభక్తి ఎక్కువ అయ్యి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పట్ల రేవంత్ రెడ్డికి గురుభక్తి ఎక్కువ అయింది. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ఎంపీలకు గురుభక్తి ఎక్కువ అయింది . తెలంగాణకు వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేవెళ్ల ఎస్సి డిక్లరేషన్ గురించి మాట్లాడాలి. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అమలు అవుతుందా?ఎస్సీ,ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఆరు లక్షలు ఇస్తామని చెప్పారు అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయాలు మాట్లాడుతున్నారు. స్పీకర్ అనే విషయం మర్చిపోయి పార్టీ కార్యక్రమాల గురించి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతున్నారు. స్పీకర్ పై గవర్నర్,లోక్ సభ స్పీకర్,రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాము.

LEAVE A RESPONSE