– ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా మరో నేషనల్ హైవేకు భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు ఉన్న జాతీయ రహదారి కారిడార్‌ను మరో జాతీయ రహదారికి కలుపుతూ 6 లేన్ల రహదారి నిర్మించేందుకు ఏకంగా రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీ సర్కార్‌కు ధన్యవాదాలు చెప్పారు.
టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సహా అన్నింటినీ తీసుకురావడంలో సఫలం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీకి నరేంద్ర మోదీ సర్కార్ మరో తీపికబురు అందించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వివిధ నేషనల్ హైవేల విస్తరణకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో నేషనల్ హైవే విస్తరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. అనకాపల్లి – ఆనందపురం నేషనల్ హైవే 16 కారిడార్‌ను నేషనల్ హైవే 516సీ లోని షీలానగర్ జంక్షన్‌ను కలుపుతూ 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం కల్పించింది.