సబ్ కా సాద్.. సబ్ కా వికాస్ బిజెపి మూల సిద్ధాంతం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

అనంతపురం పట్టణం లో చంద్ర రాజేశ్వరరావు కాలనీలో మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు సమిష్టిగా అయోధ్య శ్రీరాముని అక్షింతలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తో హాజరై అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా హిందూ, ముస్లింలు ఉద్దేశించి పురందేశ్వరి మాట్లాడుతూ.. అయోధ్య రాముడు అక్షింతలు కార్యక్రమం లో ఇంత ఐక్యం గా పాల్గొనడం హర్షణీయం అన్నారు.ఎన్టీఆర్ కు రాముడు ఆశీస్సులు ఉండడం వల్ల ఆయన ఆ పాత్రల్లో జీవించారు అన్నారు. సబ్ కా సాద్.. సబ్ కా వికాస్ బిజెపి మూల సిద్ధాంతం అన్నారు

Leave a Reply