శబరిమలై వెళ్ళు అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం, మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా, విజయవాడ-కొట్టాయం-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడపనున్నది.
రైలు నంబర్ 07139 విజయవాడ-కొట్టాయం ప్రత్యేక రైలు, డిసెంబర్ 15, డిసెంబర్ 22, జనవరి 5 తేదీలలో (శుక్రవారం), విజయవాడ నుండి సాయంత్రం 04:25 గంటలకు బయలుదేరి, మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ కు రాత్రి 07:48 గంటలకు చేరుతుంది. మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ నుండి రాత్రి 07:50 గంటలకు బయలుదేరి, కొట్టాయం కు మరుసటి రోజు రాత్రి 10 గంటలకు చేరుతుంది.
రైలు నంబర్ 07140 కొట్టాయం-విజయవాడ ప్రత్యేక రైలు, డిసెంబర్ 17, డిసెంబర్ 24, జనవరి 57 తేదీలలో (ఆదివారం), కొట్టాయం నుండి అర్ధరాత్రి 01:00 గంటకు బయలుదేరి, మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ కు రాత్రి 10:30 గంటలకు చేరుతుంది. మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ నుండి రాత్రి 10:32 గంటలకు బయలుదేరి, విజయవాడ కు మరుసటి రోజు ఉదయం 06:15 గంటలకు చేరుతుంది.
ఈ రైలు మార్గమధ్యంలో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, కోయిలకుంట్ల, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువ, ఎర్నాకులం టౌన్ రైల్వేస్టేషన్లలో ఆగనున్నది.
01 ఏసి ఫస్ట్ క్లాస్-కం-ఏసి టూ టైర్, 2 ఏసి టూటైర్, 2 ఏసి త్రీటైర్, 10 స్లీపర్, 4 జనరల్, 2 బ్రేక్ వ్యాన్ లతో సహా, మొత్తం 21 బోగీలతో ఈ రైలు నడవనున్నది.