రైతు భరోసా కేంద్రాలలో నకిలీ వేప నూనె అమ్మకాలు

-10 మంది ఉద్యోగులు సస్పెండ్
గుంటూరు జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలలో నకిలీ వేప నూనె అమ్మకాలు చేస్తున్న 20 మంది వ్యవసాయ ఉద్యోగులపై ఉన్నతాధితారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని హోం మంత్రి సుచరిత స్వంత
నియోజకవర్గమైన ప్రత్తిపాడు రైతు భరోసా కేంద్రాలలో సిబ్బంది నకిలీ వేప నూనే అమ్మకాలు చేపట్టారు.
ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా వేప నూనె అమ్మకాలు చేయడం పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కొంత మంది రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ లు చేపట్టారు. తనీఖీలలో నకిలీ వేప నూనె అమ్మకాలు నిజమేనని నిర్దారించుకున్న అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఈ నివేదిక ఆధారంగా ప్రత్తిపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి తో పాటుగా 9 మంది రైతు భరోసా కేంద్రం సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాలలో లభించిన వేప నూనె తయారు చేసే గుంటూరు ఆటో నగర్ లోని కల్తీ వేప నూనె తయారీ కేంద్రం పై కూడా వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేశారు. నకిలీ వేప నూనె అమ్మకాలు పై ప్రత్తిపాడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆటో నగర్ లో నకిలీ వేప నూనె తయారీ పై పాత గుంటూరు స్టేషన్ లలో వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం లో వెలుగు చూసిన ఈ నకిలీ వేప నూనె అమ్మకాలు , 10 మంది ఉద్యాగులు సస్పెండ్ పై జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ నకిలీ అమ్మకాలు ప్రత్తిపాడు కే పరిమితం అయిందా లేక జిల్లా అంతటా ఇదే పరిస్దితి ఉందా అనే అనుమావాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రైతు భరోసా కేంద్రాలలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి అమ్మకాలు చేయడానికి వీలు లేదని వ్యవసాయ శాఖ జేడీ విజయ భారతి స్పష్టం చేసారు.

-Vasireddy Ravichandra
Guntur ,7673911100

Leave a Reply