– కుప్పంలో చిత్తూరు జిల్లా జనసేన నాయకులతో చంద్రబాబు సమావేశం
కుప్పం :- జగన్ ను శాశ్వతంగా ఇంటికి పంపితేనే రాష్ట్రానికి మోక్షం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలోని ఎమ్.ఎమ్.ఫంక్షన్ హాలులో చిత్తూరు జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…‘‘రాష్ట్రం గెలవాలి…వ్యక్తులు కాదు. సమాజ హితం తెలిసిన పార్టీలు టీడీపీ – జనసేన. మా కలయిక మా కోసం కాదు..రాష్ట్రం కోసం. ఎంతోమంది సీఎంలను చూశానుగానీ ఇంతటి నేర చరిత్ర కలిగిన సీఎంను ఎప్పుడూ చూడలేదు.
పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు వస్తాయి..కొందరికి రావు..కానీ అందరికీ న్యాయం చేస్తాం. నేను పవన్ కూర్చుని అందరికీ న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. మనం ఎందుకు కావాలి..ఎందుకు గెలవాలో ప్రజలకు చెప్పాలి. పొత్తుల పై నాలుగైదు నెలల ముందే మిమ్మల్ని నేను, పవన్ ప్రిపేర్ చేశాం..ఇది మంచి కలయిక అవుతుంది. కలయిక ఎంత ముఖ్యమో ప్రజలతో ఓటు వేయించడం కూడా అంతే ముఖ్యం. ప్రతిఓటూ వేయించే బాధ్యత ఇరు పార్టీ ల కార్యకర్తలు తీసుకోవాలి. సమైఖ్యంగా ముందుకు వెళదాం.’’ అని చంద్రబాబు అన్నారు