సంత్ సేవాలాల్ మహరాజ్- కొమరం భీమ్ జయంతి ని పబ్లిక్ హాలిడే చెయ్యాలి

– బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్

సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 రోజును ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన ప్రభుత్వం పట్ల బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ తీవ్ర అభ్యంతరం చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆప్షనల్ హాలిడేను వెంటనే పబ్లిక్ హాలిడే మార్చాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ NCC గేటు దగ్గర రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు శాంతియుతంగా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.

ఎవరికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా తమ నిరసన తెలియజేస్తున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేసి అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం హరిస్తుంది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ ప్రజల పట్ల చాలా దాహిష్టంగా ప్రవర్తిస్తుందని, నిరసన కారులపై విచక్షణరహితంగా దాడిగా పాల్పడుతున్నారని మహిళలు అని కూడా చూడకుండా పక్కకు లాగివేయడం తీవ్ర ఉద్రిక్తత రేగింది.
ఈ దాడిని ఖండిస్తూ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ. శ్రీ. సంత్ సేవలాల్ మహరాజ్ జయంతిని పబ్లిక్ హాలిడే గా మార్చాలని, అలాగే మాన్యం వీరుడు కొమరం భీమ్ జయంతి ఫిబ్రవరి 22 నాడు కూడా ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఏకవాక్య తీర్మానం చేసిన ప్రతిని మీడియాకు చూపిస్తూ.. ప్రభుత్వం వెంటనే పబ్లిక్ హాలిడేగా మారుస్తూ ఈ శాసనసభ సమావేశాల్లో ఈ గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే బంజారాహిల్స్ లో శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించి దానిలో కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని కోరారు. దానితో పాటు హైదరాబాద్ సెంటర్లో మాన్యం వీరుడు కొమురం భీం 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గిరిజనుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గిరిజనుల డిమాండ్లను సాదించేదాకా మా ఇ పోరాటం ఆగదని దీన్ని ఇంకా ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని తెలిపారు. అలాగే నిరసన లో పాల్గొన్న మద్దతుదారులను అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply