అర్హులు నష్టపోకుండా చూడండి

– ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అయిదు గ్యారంటీలకు 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి.

జనవరి 12వ తేదీ నాటికే రికార్డు టైమ్ లో డేటా ఎంట్రీ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

కొందరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు డేటా బేస్ ద్వారా గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించారు.

రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా ఉన్నవి, నెంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు కూడా ఉన్నాయి. అసలైన అర్హులు నష్టపోకుండా వీటిని మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Reply