రేవంత్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

-కేసీఆర్.. ఖబడ్దార్!
-టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటదో ఉండదేమో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిది. కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే బిజెపి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నట్లే. ఖబర్దార్ బిజెపి, బీఆర్ఎస్ నాయకుల్లారా.. తక్షణమే బేషరతుగా మా పార్టీ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేయని వ్యక్తి , ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అంబేద్కర్ కు అవమానం జరిగిందని మాట్లాడడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా? ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న దృష్ట్యా, ప్రభుత్వ ఆధ్వర్యంలో మహా నాయకుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించలేకపోయింది.

ఈ నెలలో సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, కొమురం భీం, అంబేద్కర్, జయంతి ఉత్సవాలు ఉండగా వాటిని కూడా ప్రభుత్వం ఎన్నికల కోడ్ దృష్ట్యా నిర్వహించలేకపోయింది. అంతేకాకుండా భద్రాద్రి భద్రాచలంలో, శ్రీ రాములవారి కళ్యాణ మహోత్సవానికి కూడా ఎన్నికల కోడ్ రావడం వలన, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వెళ్లలేక పోయారు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే, కేసిఆర్ వాస్తవాలను వక్రీకరించి తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం, ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా.

Leave a Reply