Suryaa.co.in

Andhra Pradesh

జగన్ లా నీచరాజకీయాలు చేయడం మాకు చేతకాదు

-మంగళగిరి నియోజకవర్గ చేరికల సందర్భంగా నారా లోకేష్
-యువనేత లోకేష్ సమక్షంలో 220 మంది టిడిపిలో చేరిక

అమరావతి: మంగళగిరి నెం.1గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 220 మంది టిడిపిలో చేరారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దుగ్గిరాల మాజీ ఎఎంసి చైర్మన్ కొండూరి ముత్తయ్య, ఆయన సతీమణి, శృంగారపురం సర్పంచ్ కొండూరు సంధ్యారాణి ఆధ్వర్యంలో 50మంది, మంగళగిరి 27వవార్డుకు చెందిన ఎస్ కె నాగూర్ వలి, ఎస్ కె హకీం ఆధ్వర్యంలో 50 మంది మైనారిటీ సోదరులు, మాదిగాని గురునాథం ఆధ్వర్యంలో 100మంది నేతలు, మంచికలపూడి నుంచి అద్దేపల్లి జయరాజు, పెరవలి గాంధీ, యార్లగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 20మంది టిడిపిలో చేరారు. మంగళగిరి నియోజకవర్గ దళితనేతల్లో కొండూరి ముత్తయ్య కీలకనేతగా ఉన్నారు. ముత్తయ్య రాకతో దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం పార్టీకి అదనపు బలం చేకూరింది.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ కు శవరాజకీయలే తెలుసు. కోడికత్తి ఘటన తర్వాత సొంత బాబాయిని చంపి సానుభూతి పొందారు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. ఈ సాకుతో ఎవరిని బలి ఇస్తారోనని అందరూ భయపడుతున్నారు. చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి 53రోజులు జైలులో పెట్టినా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. జగన్ మాదిరిగా మాకు నీచ రాజకీయాలు చేయడం మాకు చేతకాదని లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE