శీతల సప్తమి

హిందూ మతంలో శీతల దేవత ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం రెండుసార్లు శీతల సప్తమి వస్తుంది.

ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షంలో సప్తమి రోజున, రెండోది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. ఈ పవిత్రమైన రోజున శీతల దేవతను ఆరాధించడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.

అంతేకాకుండా.. అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతారు. అందుకే ప్రతి సంవత్సరం శీతల సప్తమి రోజున శీతలామాతను పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి నిల్వ ఉంచిన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. అంతేకాదు.. ఈరోజున ఇంట్లో పొయ్యి వెలిగించరు. అందరూ నిల్వ ఉంచిన ఆహారాన్నే తింటారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారి భక్తులందరూ ఉపవాసం ఉంటారు. శీతల సప్తమి రోజున ప్రజలు తీపి వంటకాలను ఎక్కువగా వండుతారు. ఆ తర్వాత అష్టమి రోజున నిల్వ ఉంచిన ఆహారాన్ని ప్రసాదంగా పంచుతారు. శీతల సప్తమిని బాసోడ అని కూడా అంటారు.

శీతల మాతను ఆరాధించడం వల్ల మనిషికి తట్టు, మశూచి, కలరా, కంటి వ్యాయాధులు వంటి తీవ్రమైన వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే సమయంలో ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. తిండికి కూడా ఎలాంటి లోటు ఉండదని చాలా మంది నమ్ముతారు.
– రాఘవశాస్త్రి

Leave a Reply