Suryaa.co.in

Devotional

శని త్రయోదశి ప్రాధాన్యత

శని దేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడతాడు.

శని త్రయోదశి అంటే
శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి , ఎలా చేయాలి ? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానంతీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.

త్రయోదశి వ్రతం
శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం.దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు.

– శేషార్జున్‌ దారా

LEAVE A RESPONSE