Home » మేనత్తకు షర్మిల కౌంటర్

మేనత్తకు షర్మిల కౌంటర్

వైఎస్ షర్మిల,వైఎస్ సునీత కుటుంబ పరువు తీస్తున్నారంటూ మేనత్త విమలమ్మ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మేనత్త వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ, చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ మరిచిపోయినట్టుంది అంటూ ఎత్తిపొడిచారు.

వివేకా హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదని స్పష్టం చేశారు. హత్య కేసులో ఆధారాలు ఉన్నందునే గట్టిగా చెబుతున్నామని అన్నారు. మళ్లీ అలాంటి అన్యాయం జరగకూడదనే అక్కాచెల్లెళ్లం పోరాడుతున్నామని షర్మిల వివరించారు. హత్యా రాజకీయాలు ఆగాలనేదే తమ పోరాటం అని పేర్కొన్నారు.

“విమలమ్మ కుమారుడికి జగన్ పనులు ఇచ్చారు. ఆర్థికంగా బలపడినందువల్లే విమలమ్మ అన్నీ మరిచిపోయారు. వివేకా ఎంత చేశారో విమలమ్మకు ఏమీ గుర్తులేనట్టుంది” అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Leave a Reply