Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వ అవినీతిపై సమరశంఖం పూరించాలి

– టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన, ఆయన నివాసంలో ఈ ఉదయం రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, జగన్ రెడ్డి అవినీతి తారాస్థాయికి చేరిందని ఈ సందర్బంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్ రెడ్డి అవినీతిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లి ఎండగట్టాలని నిర్ణయించడం జరిగింది. యనమల రామకృష్ణులు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి రాక్షస పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు.

ఈ సమావేశంలో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ గురజాల మాల్యాద్రి, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి రావు, తెలుగుదేశం మానవ వనరుల విభాగం కోఆర్డినేటర్ బి.రామాంజనేయులు, తోపూరి గంగాధర్, అంకయ్య చౌదరి, ఎన్.విజయ్ కుమార్, వీర వెంకట గురుమూర్తి, గాజుల ఆదెన్న, బి, పాలడుగు వినీల, అనలిస్ట్ లు గుమ్మడి ప్రభాకర్, వున్నం.నాగరాజు, పి.సంతోష్ తదితరులు ఈ సమావేశంలో చర్చించారు.

LEAVE A RESPONSE