– ఎమర్జెన్సీ మీద మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు
– దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ
– వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
– సహజ సంపదను దోచుకు తిన్నారు
– కులమతాల మధ్య చిచ్చు పెట్టారు
– మణిపూర్, గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా?
– పోలవరం ప్రాజెక్టు ను మోడీ నిర్వీర్యం చేస్తున్నాడు
– ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంట్ లో ప్రశ్నించే ఒక్క మగాడూ లేడు
– కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం.. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే
– వైసీపీ కి కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మండిపాటు
ఏలూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది.. గత 11 ఏళ్లుగా మోడీ ప్రధాని గా ఉండి విభజన హామీలను నెరవేర్చలేదు.. విభజన హామీలు నెరవేరాలి అంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఇక్కడి విలేఖర్లతో మాట్లాడారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే…
పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మార్చారు. పోలవరం ప్రాజెక్ట్ ను నీటి నిల్వ కోసం కట్టిన బ్యారేజ్ గా మార్చారు. ఎత్తు 45 నుంచి 41 ఎత్తు తగ్గిస్తుంటే అడిగే ఒక్క మగాడు లేడు. పార్లమెంట్ లో ఒక్కడు కూడా నోరు విప్పలేదు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు ఒక్కడికి దమ్ము లేదు. 80 వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ నిధులు మిగిలించడానికి పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మూడు పార్టీలు మోడీకి తొత్తులుగా మారి పని చేస్తున్నారు.
రాష్ట్ర బాధ్యత నాది అని చెప్పి మోడీ మోసం చేశారు. మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడదు. విభజన సమస్యలు అమలు కావు. రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిది. విభజన చట్టంలోనే రాజధాని నిర్మాణం కి కేంద్రం నిధులు ఇవ్వాలని ఉంది. నిధులకు బదులు ఇప్పుడు అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇచ్చి రాష్ట్రం నెత్తిన భారం మోపుతున్నారు. బీజేపీ ఇంత అన్యాయం చేస్తుంటే బాబు, పవన్ కూటమి కట్టారు. మోడీ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాసోహం అంటున్నారు. మోడీకి రాష్ట్రంలో యోగా కావాలి కానీ ప్రజల సమస్యలు అక్కర్లేదు.
యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదు.
ఎమర్జెన్సీ మీద మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. మోడీ పాలన ఎమర్జెన్సీ తలపిస్తోంది. ఆ ఎమర్జెన్సీ కంటే ఈ ఎమర్జెన్సీ నే ఎక్కువ. దేశంలో మొత్తం వ్యవస్థలను నాశనం చేశారు. గోద్రా, మణిపూర్ ఘటనలకు ఎవరు కారణం? ఈ ఘటనలు ఎమర్జెన్సీ అనరా? ఈరోజు వరకు ప్రధాని మణిపూర్ వెళ్ళలేదు. బీజేపీ రైటిస్ట్ పార్టీ.. మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. మంటలు పెట్టీ చలి కాచుకుంటున్నారు..ఇది కాదా ఎమర్జెన్సీ? దేశ సంపదను అదానీ, అంబానీకి దోచి పెట్టారు.. ఇది కాదా ఎమర్జెన్సీ?
ఈడి, సీబీఐ, ఐటీ ఎన్నికల సంఘం అన్ని మీ గుప్పిట్లోనే ఉన్నాయి. ఈ దేశంలో బీజేపీ కి వ్యతిరేకంగా ఎవరిని మాట్లాడనివ్వరు. మాట్లాడితే కేసులు పెడుతారు అని భయం. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. బలమైన ప్రాంతీయ పార్టీలు సైతం కేసులు పెడతారు అని భయం. వైసీపీ, బీఆర్‌ఎస్ లాంటి పార్టీలు కూడా కేసులకు బయపడి మోడీ గుప్పిట్లోకి వెళ్ళారు. మీడియాను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇది కాదా ఎమర్జెన్సీ..? మోడీ సమాధానం చెప్పాలి
బనకచర్ల మీద రాష్ట్ర ప్రయోజనాలే మా స్టాండ్. అని పార్టీలతో కలిసి నీటి హక్కుల కోసం పోరాడుతాం.
కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం. పిల్ల కాలువలు అని సముద్రంలో చేయాల్సిందే… వైసీపీ కి కూడా ఈ విధానం వర్తిస్తుంది. వైసీపీ కి ఎటువంటి ఆంక్షలు లేవు.. కాంగ్రెస్ పార్టీ మీదే ఆంక్షలు… వైసీపీ కార్ల కింద జనాలకు తొక్కుతున్నా అన్ని అనుమతులు ఇస్తారు. మా పోరాటాలకు మమ్మల్ని హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. వినే వాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు. వైసీపీ కూడా ఇలాగే సింగయ్య హత్య గురించి చెప్తుంది. వివేక హత్య మీద మాట మార్చారు..ఇప్పుడు సింగయ్య ది ఏఐ గ్రాఫిక్ అంటున్నారు. మాట మార్చడం వైసీపీ కి అలవాటు.