Suryaa.co.in

Telangana

సార్..నో స్మోకింగ్ ప్లీజ్..

-నగరాన్ని చుట్టిన “మాచన”
-“నో స్మోకింగ్ డే” వినూత్న ప్రచారం

ధూమపానంకు దూరం గా ఉంటే, మనకు అనారోగ్యం ఆమడ దూరంలో ఉంటుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ సూచించారు. బుధవారం నేషనల్ నో స్మోకింగ్ డే సందర్భంగా రఘునందన్ హైదరాబాద్ లో ని పలు ప్రాంతాల్లో.. “సే నో టు టు టుబాకో”,. “స్మోకింగ్ కిల్స్” ఆన్న సందేశం రాసి ఉన్న తన ద్విచక్ర వాహనం పై నగరం లోని పలు ప్రాంతాల్లో పర్యటించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నగర వాసులకు సిగరెట్, బీడీ అలవాట్ల వల్ల కలిగే అనర్థాలను వివరించానన్నారు. ధూమపానం అలవాటు వల్ల ఏటా 9 మిలియన్ల జనం ప్రాణాలు కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.దమ్ము కొట్టే అలవాటు ఉన్న వారు, ఒక్క సారి “ప్రాణాలు తీసే ఈ అలవాటు అవసరమా” అని ఆలోచించుకోవాలని అర్థించారు.

ఐదేళ్ల లో ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఐదు వందల గ్రామాల్లో సుమారు యాభై వేల పై చిలుకు జన బాహుళ్యానికి పొగాకు, ధూమపానం అలవాట్ల వల్ల ఎంత నష్టం కలుగుతుందొ వివరించినట్టు మాచన రఘునందన్ చెప్పారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి సమాజ హితం కోసం పాటు పడటం ఎంతో గర్వ కారణం గా ఉందని మేడ్చల్ జిల్లా లో ఉత్తమ గ్రామ పంచాయతీ గా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకున్న కేశవరం కు చెందిన పలువురు రఘునందన్ కృషి ని అభినందించారు

LEAVE A RESPONSE