Suryaa.co.in

Andhra Pradesh

కొంతమంది మంత్రులు కాపు నేతలుగా చెప్పుకుంటూ కాపులకు అన్యాయం చేస్తున్నారు

– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

కొంతమంది మంత్రులు కాపు నేతలుగా చెప్పుకుంటూ కాపులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మండిపడ్డారు. సోమవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రిలో ప్రసంగించిన నాయకులు కాపు కులానికి చెందిన వారే కాదు. నేడు రాజమండ్రిలో మాట్లాడిన వైసీపీ నాయకులు మేకవన్నెపులులు. కొంతమంది మంత్రులు కాపు నేతలుగా చెప్పుకుంటూ కాపులకు అన్యాయం చేస్తున్నారు. టీడీపీ నేతలు కాపు కులానికి ఏమీ చేయలేదని చెప్పడం శుద్ధ అబద్ధం. కాపులను నయవంచన చేసిన ద్రోహి జగన్ రెడ్డి. అనేది నగ్నసత్యం. అంబటి రాంబాబుతో సహా మాట్లాడిన ఇతరులు కాపు కుల ప్రతినిధులు కాదు.మీ బాబాయి కేసులోనే మీరు బయటపడలేకున్నారు. 30 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసు గురించి మాట్లాడడం మంచిదికాదు. తెలుగుదేశం కల్పించిన రిజర్వేషన్ ను వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది.టీడీపీ పెట్టిన రిజర్వేషన్ నే తప్పుపట్టడం కాపు సామాజికవర్గాన్ని ద్రోహం చేయడమే.

వైసీపీ రిజర్వేషన్ల విషయంలో టీడీపీ మోసం చేసిందని చెప్పడం అబద్ధం. కాపులకు వైసీపీ న్యాయం చేస్తుందనడం భ్రమే. యేటా రూ.2వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. కాపు నేస్తం పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన కాపు మహిళలకు యేటా రూ15 వేలు అందిస్తామని ఊరడిస్తున్నారు. ఐదేళ్లలో రూ. 75 వేల సాయం చేస్తామని ఉత్తుత్తి మాటలు చెబుతున్నారు. కాపు, బలిజ, వంటరి, తెలగ కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వైఎస్ రెండు సార్లు మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారు. టీడీపీ విద్య, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు లేక ఇబ్బందులు పడతున్న కాపు సంక్షేమానికి మొదటి నుంచి కట్టుబడి పనిచేసింది. 2014 మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భారత దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక సామాజిక వర్గానికి బీసీ స్టేటస్ కల్పించాలంటే ముందుగా ఆ రాష్ట్రం ఆ స్టేటస్ కల్పించాలి. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా రూ.4,528 మంది కాపు విద్యార్థులకు లబ్ది చేకూర్చాం. ఎన్టీ ఆర్ విద్యా పథకం ద్వారా రూ.28.26 కోట్లతో 1413 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చాం. ఉప ముఖ్యమంత్రి పదవిని కాపు నాయకులకు ఇచ్చాం.

ప్రతి జిల్లాలో కాపు భవన్ లు నిర్మించాం. ఒక్కొక్క భవనానికి రూ. 5 కోట్లు కేటాయించాం. కాపులకు రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా మోడీ ని ప్రశ్నించాల్సి వస్తుందన్న భయంతో వైసీపీ ఎంపీలు దొంగ రాజీనామాలు చేశారు. జగన్ కాపు రిజర్వేషన్ కేంద్రం పరిధిలోనిది అంటూ చేతులెత్తేసి అధికారంలోకి వచ్చీ రాగానే టీడీపీ కల్పించిన 5 శాతం రిజర్వేషన్ ను కూడా రద్దు చేశారు.
అసలు కాపులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్పించిన రిజర్వేషన్ లను వైసీపీ ఎత్తివేయడానికి ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండా టీడీపీ కల్పించిన రిజర్విషన్లను తప్పు పట్టడం కాపు సామాజిక వర్గాని ద్రోహం చేయడమేనని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు వివరించారు.

LEAVE A RESPONSE