ఏబీకి మళ్లీ ఈ‘సారీ’..

– ముఖం చాటేసి వెళ్లిపోయిన సీఎస్
– వెయిటింగ్‌లో ఉంచి వెళ్లిపోయిన సీఎస్ శర్మ
– రెండుసార్లు ఏబీకి తప్పని నిరాశ

ఆయన ఒక డీజీపీ. అంటే సీనియర్ ఐపిఎస్ అధికారి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి విధుల్లో చేరేందుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు వెళ్లారు. ఎందుకంటే పోస్టింగ్ ఇవ్వాల్సింది ఆయనే కాబట్టి. అపాయింట్‌మెంట్ కోసం వెళ్లిన ఐపిఎస్ అధికారి సీనియర్ అయితే.. అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిన అధికారి కూడా సీనియర్ ఐఏఎస్ అన్నమాట. అంటే రెండు ఉన్నత వ్యవస్థలు ఒకరినొకరు గౌరవించుకోవాలన్న మాట. కానీ.. ఏపీలో అలాంటి సంప్రదాయాలు, మర్యాదలు, మట్టిగడ్డలూ పాటిస్తున్న దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్న సీనియర్ ఐపిఎస్ అధికారిని, రెండుసార్లు వేచి ఉండేలా చేసి అవమానించిన సీఎస్ వైఖరిపై, ఐపిఎస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయాల్సిన సీఎస్, తన వద్దకు వచ్చిన సీనియర్ ఐపిఎస్ అధికారిని బయట వెయిట్ చేయించి, సెక్రటేరియేట్ నుంచి వెళ్లిపోవడం ఏం మర్యాద అన్నది అధికారుల ప్రశ్న. రెండోసారి సీఎస్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేసిన ఆ సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అయితే… ఆయనను రెండుసార్లు వెయిట్ చేయించిన ఘనత ఏపీ సీఎస్ సమీర్ శర్మది.

ఇక బుధవారం ఏపీ సచివాలయంలో ఏం జరిగిందంటే…తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సచివాలయానికి వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఏబీవీ గతంలో సచివాలయానికి వెళ్లి సీఎస్‌ను కలిసిన విషయం తెలిసిందే.ఇదే విషయమై ఇవాళ మరోసారి సీఎస్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే ఆయన్ను కలిసేందుకు సీఎస్ సుముఖత చూపలేదు. ఏబీవీని వెయిటింగ్ రూమ్‌లో కూర్చొబెట్టి సచివాలయం నుంచి సీఎస్ వెళ్లిపోయారు.ఇది కూడా చదవండి.. ఆడు మగాడ్రా బుజ్జీ

ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ ఏప్రిల్‌ 29న సచివాలయానికి వెళ్లారు. తన సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ సమీర్ శర్మను కలిసి సుప్రీంకోర్టు ఆదేశాలను అందజేశారు.

పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాం ధరించి సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల రీత్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు సచివాలయానికి వచ్చినట్లు ఏబీవీ స్పష్టం చేశారు. పోస్టింగ్‌తో పాటు పెండింగ్ జీత భత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. పోస్టింగ్ అంశాన్ని ప్రాసెస్‌లో పెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ప్రాసెస్‌లో పెడతామని చెప్పిన సీఎస్‌.. ఏబీవీ అక్కడ ఉండగానే సచివాలయం నుంచి వెళ్లిపోవడం గమనార్హం. తాజా ఘటనపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇది కూడా చదవండి.. ఆడు మగాడ్రా బుజ్జీ