– రోడ్డును నిర్మించడంతో పాటు వాటర్ స్పోర్ట్స్, టూరిజం పార్కు ఏర్పాటు చేయాలి
– అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– సానుకూలంగా స్పందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బీచ్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. వేళాంగిణి మాత చర్చి ఉండటంతో ప్రతి వారం వేలాదిగా పర్యాటకులు వస్తుంటారు. కోడూరు బీచ్ కు సమీపంలోనే కృష్ణపట్నం పోర్టు, పవర్ ప్రాజెక్టులున్నాయి.
పారిశ్రామిక ప్రాంతం కావడంతో వారమంతా పనిచేసిన కార్మికులు ఈ బీచ్ కు వచ్చి సేదతీరుతుంటారు. నెల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పర్యాటకుల రాకపోకలు జరుగుతుంటాయి. ఇప్పటికే బీచ్ లో ఉన్న రిసార్ట్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. బీచ్ లో వాటర్ స్పోర్ట్స్, టూరిజం పార్కు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.
మహాలక్ష్మి పురం నుంచి బీచ్ కి వెళ్లే రోడ్డు దారుణంగా ఉంది. ఆ రోడ్డు నిర్మాణానికి రూ.3.50 కోట్లు అవసరమవుతాయి. నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రిని కోరాను..నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. కోడూరు బీచ్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి.