ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం క్రీడపోటీలు ప్రారంభించిన క్రీడ శాఖ మంత్రి
– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల నిర్వహణ
– అట్టహాసంగా ప్రారంభమైన మహిళా ఉద్యోగుల ఆటల పోటీలు.
– మహిళా మూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా ఉద్యోగులతో నిర్వహించే ఆటల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించారు. మహిళ మూర్తులు ఇటువంటి క్రీడలు ఏర్పాటు చేయడం ఆదర్శప్రాయంగా ఉందని, శారీరక దృఢత్వంతో మానసిక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ ద్వారా క్రీడాకారులకు తోడ్పాటు అందిస్తుందని పేర్కోన్నారు. ఏపీ ఎన్జీజీవోస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిర్మల కుమారి, కన్వీనర్ మాధవి గారు, ఆల్ ఇండియా ఎన్ ఈసీ మెంబెర్ శాంతి శ్రీ, మహిళ ప్రతినిధులు శివ లీల, విజయశ్రీ, ఏపీ రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు ఎం రాజబాబు, ఏపీ ఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సి వి.ఆర్ ప్రసాద్ ఉన్నారు.