ఆదర్శ పాత్రికేయుడు శ్రీధర్

-విజయవాడ ప్రెస్ క్లబ్ లో సంతాప సభ

నాలుగు దశాబ్దాల పాత్రికేయ వృత్తిలో నిబద్ధతతో నిజాయితీగా పనిచేసిన ఎస్టీజి శ్రీధర్ యువ పాత్రికేయులకు ఆదర్శప్రాయులని ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. ఆయన ప్రతి పాత్రికేయునితో ఎంతో సన్నిహితంగా, ఆత్మీయంగా ఉండేవారని చెప్పారు. ఇటీవల కరోనా కారణంగా మృతి చెందిన ఎస్టీజి శ్రీధర్ సంతాప సభ విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగింది.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 130 మంది వరకు జర్నలిస్టుల వరకు మృతి చెందడం బాధాకరమన్నారు. కరోనాతో మృతి చెందిన పాత్రికేయులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.ఐదు లక్షల పరిహారాన్ని అందించాలని ఆయన కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్షులు చావా రవి, సీనియర్ పాత్రికేయులు ఎస్టీజి శ్రీధర్ అత్యంత సన్నిహితులు గరికపాటి రవికుమార్, జయరాం శ్రీధర్, సీనియర్ ఫోటోగ్రాఫర్ సిహెచ్ విజయభాస్కరరావు, డెక్కన్ క్రానికల్ ప్లాంట్ యూనియన్ నేత యాదల శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply