అండగా నిలవండి.. ఆశీర్వదించండి

– తంగిరాల సౌమ్య

నందిగామ (అనాసాగరం): తనకు అండగా నిలవండి ఆశీర్వదిం చండి అంటూ మాజీ ఎమ్మెల్యే, ఎన్డీయే కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రజలను కోరారు. నియోజకవర్గ ప్రజలు తనను రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేశానన్నారు.

మరోసారి తనకు విజయాన్ని అందించాలని ఓటర్లను, మహిళలను, యువతీ యువకులను కోరారు. కూటమి పొత్తు.. ఎన్నికల వరకే కాదని నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. వైసీపీ పాలనలో పదేళ్ళు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పింఛన్ల పంపిణీపై వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని తంగిరాల సౌమ్య కోరారు.

Leave a Reply