అధికార పార్టీ చెప్పు చేతల్లో రాష్ట్రం

-వైసీపీ అక్రమాలను అడ్డుకుంటే దాడులా?
-ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు
-ఎన్నికల కమిషన్‌ తక్షణం చర్యలు తీసుకోవాలి
బీ-జేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ

ఈనెల 2వ తేదీ సాయంత్రం కాకినాడ రూరల్‌లో లారీలో వెళుతున్న చీరలు, బొట్టు బిళ్లలు, డూప్లికేట్‌ ఈవీఎంలను అడ్డుకుని మా పార్టీ నాయకులు పట్టుకుని అధికారులకు అప్పగిం చారని, వైసీపీ రౌడీలు అక్కడకు చేరుకుని మా పార్టీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడులు చే దుర్మార్గమని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ ధ్వజమెత్తారు. విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధారాలతో పట్టుకున్నా… అధికారులు మాత్రం ఆ వాహనాలను సీజ్‌ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిం చిందన్నారు.

ఈ ఎన్నికలలో అడ్డదారుల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ కార్యక్రమాలు కూడా చేసుకున్నారని, ఓటర్లను ప్రలోభ పెట్టేలా, భయభ్రాంతులకు గురిచేసే లా సిద్ధమయ్యారని ఆరోపించారు. అధికారులను కూడా తమ చెప్పు చేతల్లో పని చేసేలా బెదిరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రేపు ఎన్నికలు సజావుగా జరిగే అవకా శం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా మేము ఫిర్యాదులు చేశామని వివరించారు. ఇప్పటికే కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని, ఇంకా వైసీపీకి తొత్తులుగా పని చేస్తున్న ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

నిబంధనలు పట్టించుకోకుండా అధికార పార్టీకి అంటకాగుతున్న అధికారుల జాబితాను కూడా మా అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాబేదారులుగా వ్యవహరి స్తున్న అధికారులను తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రాంతంలో కూడా అధికారులు వైసీపీ నేతలకు వంత పాడుతున్నారని, ప్రధాన మంత్రి వస్తే ఆయన భద్రతను కూడా పట్టించుకోని పోలీసులు ఉన్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు జరిగిన బదిలీలతో పాటు మరికొన్ని బదిలీలు జరగాలని ఎదురుచూస్తున్నామని వివరించారు.

Leave a Reply