Suryaa.co.in

Andhra Pradesh

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు

– 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పర్సన్ లంకా దినకర్

అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి త్వరలోనే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శేవల దత్తుతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను వివరించారు.

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమని, గ్లోబల్ వార్మింగ్ ను కూడా నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తన నేతృత్వంలో ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శేవల దత్తు, అత్తలూరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్పీఓ వ్యవస్థాపకులు నూతలపాటి సురేంద్ర , ఆర్గానిక్ ఫార్మింగ్ నిపుణులు శరత్ కుమార్ రెడ్డి పెద్దకూర పాడు నియోజకవర్గం అత్తలూరు లోని అత్తలూరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్పిఓ ను సందర్శించి అక్కడే జరిగే ప్రకృతి వ్యవసాయ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు.

అత్తలూరు ఆర్గానిక్ ఫర్మింగ్ లో నిర్వహించి కార్యకలాపాలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ లో ఆర్గానిక్ ఫామింగ్ పై రైతులను ప్రోత్సహించే విధంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయం విషయంలో రైతుల్లో ఉన్న అపోహలను తొలగించి పురోగతి దిశగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడే విధంగా ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు.

అమరావతి చుట్టూ 75 లక్షల మొక్కల పెంపకం కోసం రైతుల భాగస్వామ్యం చేసేందుకే కార్యచరణ చేయనున్నామన్నారు. విజయనగరం జిల్లాలోని కొంత మంది శాసన సభ్యుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే అక్కడి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు సమక్షంలో పైలెట్ ప్రాజెక్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి కార్యాచరణకు శ్రీకారం చుటనున్నామని తెలిపారు.

రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రీయ పంటలు పండించేందుకు అవసరమైన ప్రోత్సాహం రైతులకు అందజేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శేవల దత్తు తెలిపారు. అత్తలూరిలో సేంద్రియ పంటలు పండించి వాటి ద్వారా పచ్చళ్ళు, కారం, నూనె మొదలగు వాటిని అక్కడి రైతులు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. 200 పై చిలుకు అవులతో గోశాలలో ఏర్పాటు చేసి పాల ఉత్పత్తి చేస్తున్నారని, ఆ పాలకు బాగా డిమాండ్ ఉన్నప్పటికీ సగటు మూడు లీటర్ల అవసరం ఉంటే 1 లీటర్ మాత్రమే ఉత్పత్తి చేస్తూన్నారని తద్వారా నాణ్యమైన ఉత్పత్తులకు ఉన్న డిమాండు అందరూ గమనించాలన్నారు.

రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యంద్రాప్రదేశ్ గా మార్చాలనే సిఎం ఆలోచనను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి పంటను ప్రకృతి వ్యవసాయం వెైపు మళ్లించే విధంగా, 100 శాతం ఆర్గానిక్ ధృవీకరణ పంటల ఉత్పత్తి దిశగా సేంద్రియ ఉత్పత్తులు పై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కి త్వరలోనే అందజేయనున్నామని ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE