– బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి లో పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి తో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కారు అద్దాలు పగలగొట్టి దాడిచేయడం హత్యాయత్నానికి పాల్పడిన టిఆర్ఎస్ కార్యకర్తల పై కఠిన చర్యలు తీసుకోవాలి.
పోలీసు యంత్రాంగం సాక్షిగా దాడి జరగడం దారుణం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై టీఆర్ఎస్ ప్రోత్సహించడం సిగ్గుచేటు. అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న పార్లమెంటు సభ్యుల పై ప్రజా ప్రతినిధులపై దాడులను ప్రోత్సహించడానికి నియంతృత్వానికి ప్రతీక.దాడులతో బిజెపి కార్యకర్తలను నాయకులను భయపెట్టాలని టిఆర్ఎస్ అధినేత భావిస్తే మరింత ఉదృతంగా కార్యకర్తలు టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇలాంటి దాడులకు బిజెపి భయపడే ప్రసక్తే లేదు.