భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా

బండి సంజయ్ కుమార్

గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని అడిగితే అరెస్ట్ చేస్తారా?. హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనియ్యరా?  అందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అడిగితే అరెస్ట్ చేయడమేంటి? ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరగాలని మేం అనుకుంటున్నాం… రాచిరంపాన పెట్టాలని సీఎం చూస్తున్నడు. ఇతర వర్గాల పండుగలకు రాని ఇబ్బందులు హిందువుల పండుగలకే ఎందుకు?  హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నా. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైంది.