టీడీపీ, వైసీపీలకి మేం దూరం: సునీల్ దేవధర్

Spread the love

-టీడీపీ, బీజేపీ మళ్లీ కలుస్తాయంటూ ప్రచారం
-ఖండించిన సునీల్ దేవధర్
-తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని వెల్లడి

ఇటీవల కాలంలో ఏపీలో పొత్తుల అంశం విశేషంగా చర్చకు వస్తోంది. టీడీపీ, బీజేపీ మధ్య మైత్రికి జనసేనాని పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ స్పందించారు.

నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో బీజేపీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎవరితో పొత్తు ఉంటుందన్న దానిపై రకరకాలు వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. ఏపీలో తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలకు తాము దూరంగా ఉంటామని వెల్లడించారు. ఈ విషయాన్ని నేతలు కార్యకర్తలకు వివరించాలని సునీల్ దేవధర్ సూచించారు.

Leave a Reply