Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

-పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం
-మహానాడుద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం వినపడాలి
-క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం రాష్ట్రమంతా మారుమోగాలి
-ఇలాంటి చిల్లర, పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు
-మర్యాదగా నడుచుకుంటే మర్యాదగానేఉంటా.. కోపమొస్తే ఒక్కొక్కడి సంగతితేలుస్తా… మీరందరూ భవిష్యత్ లో ఇక్కడే తిరగాలని గుర్తుంచుకోండి
-టీడీపీ అడిగితే బస్సులు ఇవ్వకుండా నాటకాలు ఆడుతారా?
-తమ్ముళ్లూ…చెల్లెమ్మల్లారా మహానాడుని జయప్రదం చేయండి.. అడ్డుకుంటే ఆగడం తెలుగుదేశం రక్తంలోనే లేదు
-అవసరమైతే కాలినడకన రండి… కదనోత్సాహంతో ఉరికిరండి.
జగన్మోహన్ రెడ్డికి ఊడిగంచేస్తూ, ఓవరాక్షన్ చేసేవారిని ఎవరినీ వదిలిపెట్టను
-అప్పులుపుట్టక, పాలనచేతగాక జగన్ రెడ్డి మధ్యంతరఎన్నికలకు వెళ్లి, ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు

“భారీర్యాలీతో మహానాడుకి వెళ్తున్నసందర్భంలో గ్రామగ్రామాన ఎదురేగి ఘనస్వాగతం పలుకుతున్న కార్యకర్తలు, తెలుగుతమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. మహానాడుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈప్రభుత్వం కంపించిపోయేలా ప్రజలంతా భారీగా మహానాడుకి తరలిరావాలని కోరుతున్నా. క్విట్ జగన్ క్విట్ జగన్, సేవ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో మహానాడు
1 ప్రాంగణమే కాదు యావత్ రాష్ట్రం దద్దరిల్లిపోవాలి. స్వచ్ఛందంగా పార్టీకార్యకర్తల ఆకలితీర్చడానికి ముందుకొచ్చిన భాష్యంప్రవీణ్ ను మనస్ఫూ ర్తిగా అభినందిస్తున్నాను. ఉత్తరాంధ్ర నుంచి వేలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు చిలకలూరిపేట ప్రాంతంలో భోజనఏర్పాట్లు చేయించిన భాష్యంప్రవీణ్, ఇతర టీడీపీనేతలందరూ సమిష్టిగా పనిచేసి, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులులేకుండా చూడాలి. వారుచేసిన భోజనఏర్పాట్లు చూశాను…చాలాబాగున్నాయి.

తమ్ముళ్లూ ఇంకా ముందుముందు మనం చాలా త్యాగాలకు సిద్ధపడాలి. జగన్మోహన్ రెడ్డి కేసులతో టీడీపీ కార్యకర్తలనుబయటకు రాకుండచేయాలని చూస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం అని
3 గుర్తుంచుకో జగన్ రెడ్డి. మా తమ్ముళ్లను అడ్డుకోవడం నీతండ్రి వల్లే కాలేదు.. నువ్వుఏంచేస్తావు? ఎప్పటికప్పుడు తెలుగుదేశంపార్టీని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతూ పైశాచిక ఆనందంపొందుతున్న జగన్ రెడ్డీ.. నువ్వు చేసేవాటికి చక్రవడ్డీతో సహా భవిష్యత్ లో తిరిగిచెల్లిస్తాం. నాతో ఆటలాడతావా జగన్..? నీ తాటాకుచప్పుళ్లకు భయపడా లా? ఖబడ్దార్…. గుర్తుంచుకో!

ఆర్టీసీ అధికారులు మహానాడుకి బస్సుల అడిగితే ఇవ్వరా? అదేమంటే పిచ్చిపిచ్చికారణాలు చెబుతారా? జగన్మోహన్ రెడ్డికి ఊడిగంచేస్తూ, టీడీపీ మహానాడుకి బస్సులు ఇవ్వకుండా నాటకాలు ఆడుతారా? మీరు ఇవ్వకపోగా, ప్రైవేట్ ట్రావెల్స్ వారు, పాఠశాలలు వారు బస్సులుఇస్తామంటే వారిపైకి ఆర్టీఏ అధికారుల్ని పంపిస్తారా? మాపార్టీ ప్లెక్సీలు, బ్యానర్లు కట్టుకోనివ్వరా? ఈ రాష్ట్రం మీజాగీరా? మీఆటలు సాగవు. ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రిని, పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు? ఇతనొక సైకో. సైకోలు ఏంచేస్తారో వారికే తెలియదు. నువ్వుఏంచేస్తున్నావో నీకే తెలియడంలేదుగానీ, రాష్ట్రం సర్వనాశ నమైంది.

మహానాడుకి మేం ఇబ్బందులు కలిగించడం లేదు అని ఒక మంత్రి అంటున్నాడు. ఒంగోలులో స్టేడియంఇమ్మంటే ఎందుకు ఇవ్వలేదు? ప్రకాశం జిల్లాఎస్పీ, సహా ఇతరఅధికారులు ప్రభుత్వానికి భయపడుతున్నారు. మహానాడు ఎలాఉంటుందో మీరేచూస్తారు. ఇదిఒకప్రభంజనం, ఎక్కడికక్కడ కట్టలు తెంచుకొని ఉరకలు వేసే ఉత్సాహంతో తమ్ముళ్లు, చెల్లెమ్మలు మహానాడుకి తరలిరావాలి. ఏవాహనం దొరికితే దానిలో రండి. ఎద్దలబళ్లపైరండి… అవసరమైతేకాలినడకనరండి. మీరుఎలావస్తారో తెలియదు. కానీ మహానాడు జయప్రదం చేస్తామని గట్టిగా చెప్పండి. ఈ మహానాడు ద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం
2 మారుమోగాలి. క్విట్ జగన్..క్విట్ జగన్… క్విట్ జగన్- సేవ్ ఆంధ్రప్రదేశ్..సేవ్ ఆంధ్రప్రదేశ్. తమ్ముళ్లూ మీరుప్రజలు ఇంకాఎన్నాళ్లు కష్టాలుపడతారు? ఈ రాష్ట్రంలో ఏవర్గమైనా సంతోషంగాఉందా? ఏ కులమైనా బాగుందా? ఏగ్రామమైనా బాగుపడిందా? ఈ ముఖ్యమంత్రి బాదుడిదెబ్బకు ఏఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? రైతులు, మహిళలు, యువత బాగున్నారా? ప్రజలుసంతోషంగా ఉన్నామంటే నేను తిరిగి అమరావతికి వెళ్లిపోతా ను. మీకోసమ నేనువచ్చాను.. మీ తరుపున పోరాడటానికే వచ్చాను. నా ఆలోచన, కష్టం అంతా మీకోసమే, ఈ రాష్ట్రంకోసమే. చిలకలూరిపేటలో రూ.2లకు 20లీటర్ల తాగునీరు ఇచ్చే ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకాన్ని ప్రారంభిస్తుంటే ఎస్సీఎస్టీ కేసులు పెడతారా? ఒకరిపై కేసులు పెడతావు..ఇద్దరిపైపెడతావు.. వెయ్యిమందిపై కేసులు పెడతావు. లక్షమందిపై పెడతావా జగన్?లక్షలమంది ఒకేసారి ఆగ్రహంతో రోడ్డెక్కితే, శ్రీలంకలో మాదిరి నువ్వుకూడా పారిపోతావు జగన్. రాజపక్షే కంటే గొప్పమొనగాడా ఈ జగన్? రాజపక్షే అక్కడి మంత్రులు దేశంవిడిచి పారిపోయారాలేదా?

ప్రజాస్వామ్యంలో పద్ధతిగాఉండాలి..పద్ధ తిలేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే పారిపోక ఏం చేస్తారు? గడగడపకు అన్నారు…జనం నిల దీస్తుండటంతో ఇప్పుడు బస్సుయాత్ర అంటున్నారు. సామాజికన్యాయం అంటున్నారు.ఎక్క డుంది మీరుచెబుతున్న సామాజికన్యాయం? ఆమాటఅంటూ ఎవరిచెవుల్లో పూలుపెడతారు ? జనం మీఅందరి చెవుల్లో పూలుపెట్టే రోజువచ్చింది. రాజ్యసభ సభ్యతం ఎవరికి ఇచ్చాడు ఈ జగన్ రెడ్డి? అమరావతిని కాదని రాజధానిని విశాఖపట్నానికి తీసుకెళ్తానన్న జగన్ రెడ్డి, ఆప్రాంతానికి రాజ్యసభ ఎందుకివ్వలేదు? రాయలసీమకు ఎందుకు ఇవ్వలేదు? విజయసా యిరెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వకపోతే, ఆయన అప్రూవర్ గామారితే జగన్ జైలుకుపోతాడు. అందుకని ఆయనకు ఇచ్చాడు. తొమ్మదిమంది రాజ్యసభసభ్యుల్లో ముగ్గురు జగన్ కేసుల్లో ముద్దాయిలే. తెలంగాణకు ఒకటి, మహారాష్ట్రకు మరోటి. తనకేసులు వాదించే లాయర్ కి ఒకటి…అందరితరుపున లాబీయింగ్ చేయడానికి నత్వానికి మరోసీటు.

రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి ఏపీలో సమర్థులే లేరా? ఇంతచేస్తుంటే తమ్ముళ్లూ ఎవరికై నా పౌరుషంరాదా? ఆంధ్రాప్రజలు జగన్ దృష్టిలో బానిసలా? ఎస్సీలకు గానీ, ఎస్టీలకుగానీ, మైనారిటీలకు గానీ జగన్ రెడ్డి ఒక్కటైనా రాజ్యసభ సీటుఎందుకివ్వలేదు? మనప్రభుత్వంలో ఎస్సీలకోసం అమలుచేసిన 25కార్యక్రమాలను ఈ ముఖ్యమంత్రి రద్దు చేశాడు. బీసీలకు కూడా టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నింటినీ రద్దు చేశాడు. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. డబ్బున్నవాళ్లకు ఊడిగంచేయడం…పేదలపొట్టకొట్టడం అంటే జగన్ కు చాలా ఇష్టం. అన్నాక్యాంటీన్లు, రంజాన్ తోఫా, పెళ్లికానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్నబీమా, విదేవీ విద్య ఏమయ్యాయి తమ్ముళ్లూ? ఈయన వాటన్నింటినీ ఏంచేశాడు? ఇప్పుడు దావోస్ వెళ్లి.. నేను రాష్ట్రానికి తీసుకొచ్చిన గ్రీన్ కో ప్లాంట్ ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి దావోస్ కు వెళ్లి, 16కోట్లువృథాచేసి, కథలుచెబుతున్నాడు. నేను తీసుకొచ్చిన పరిశ్రమల్ని తప్పుపట్టాడు, మరలా ఇప్పుడు వాటికోసమే దావోస్ వెళ్లాడు.

వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు ఏంచేశాడు? అతికిరాతకంగా దళితయువకుడిని చంపి, మృత దేహాన్ని అతనింటికే తీసుకెళ్లి, కుటుంబసభ్యుల్ని భయపెట్టాడు. డబ్బులిస్తానని, చంపేస్తానని వారిని బెదిరించాడు. మృతుడికుటుంబానికి రక్షణకల్పించాల్సిన పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేసి, నిందితుడిని రక్షించడానికి ప్రయత్నించారు. దళితకుటుంబానికి న్యాయం చేయడం కోసం నిజనిర్ధారణ కమిటీని పంపించాను. మనపార్టీవారు అక్కడికివెళ్లి, వాస్తవాలు బయటకు వచ్చేలా చేశారు. ఇదంతా జరిగాకే పోలీసులు కేసుపెట్టారు. ఇప్పుడేమో అనంత బాబే చంపాడంటున్నారు. అంతకుముందు ఇదే పోలీసులు, వైసీపీవారు యాక్సిడెంట్ అన్నారు. సుబ్రహ్మణ్యం హత్య గురించి ప్రజలంతా చర్చించుకుంటుంటే,పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టారు. పోలీసులే అక్కడఉండి..మంత్రి ఇంటిని తగలబెట్టేవరకు ఏంచేశారు? ఇళ్లు, బస్సులు, దుకాణాలు తగలబడుతుంటే ఫైరింజన్లు ఎందుకు రాలేదు? వారి ఇల్లు వారే తగల బెట్టుకొని ఇతరులపై బురదవేయడానికి సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తానుతప్పులుచేస్తూ ప్రతిపక్షాలపై వేస్తుంటాడు. జగన్ రెడ్డీ..నీకుపాలన చేతగాదు. ఆర్థిక పరిస్థితిని దివాళాతీయించావు. అప్పులుపుట్టక, పాలనచేయడం చేతగాక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాడు తమ్ముళ్లూ.. ఈముఖ్యమంత్రి. మధ్యంతర ఎన్నికలకు వెళితే చేసిన తప్పుల నుంచి బయటపడతాడా? పడనిస్తామా తమ్ముళ్లూ?

ఈ ముఖ్యమంత్రికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు. ఇలా చాలా విషయాలున్నాయి తమ్ముళ్లూ..అన్ని మహానాడులో మాట్లాడుకుందాము. ఏదిఏమైనా నేనుమిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను… వీరోచితంగా పోరాడే మీఅందరికీ అండగాఉంటాను..ఎవరు ఆపుతారోచూద్దాం. అవసరమైతే నేనే స్వయంగారోడ్లపైకి వస్తాను. పోలీసులు మీరు వైసీపీకార్యకర్తల్లా పనిచేయకండి.. చట్టం ప్రకారం, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోండి. మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే అందుకు తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారని గుర్తుంచుకోండి.”

LEAVE A RESPONSE