-అంజూయాదవ్ అధికారపార్టీకి తొత్తు
– శ్రీకాళహస్తి టౌన్ సి.ఐ అంజూయాదవ్ పై డీజీపీకి పిర్యాదు చేసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
• రాష్ట్రంలో ఒకవర్గం పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
• ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేస్తూ దోషులను మాత్రం ప్రీగా వదిలిపెడుతున్నారు.
• మరికొంతమంది పోలీసులు ప్రజలపై దాడులు చేస్తూ చట్టఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.
• ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొట్టే సాయి అనే జనసేన నేతను సిఐ అంజూయాదవ్ నడిరోడ్డుపై చెంపలుపై కొట్టి అవమానించారు.
• అంతేకాకుండా, జనసేన నేతను కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారు.
• అధికారపార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా అంజూయాదవ్ గతంలోను దురుసుగా ప్రవర్తించింది.
• 2022 సెప్టెంబర్ లో ధనలక్ష్మీ అనే మహిళపై సైతం అంజూయాదవ్ తన జులం ప్రదర్శించింది.
• అప్పుడు అంజూయాదవ్ దాడిలో గాయపడిన ధనలక్ష్మీ హాస్పిటల్ పాలైంది.
• అంజూయాదవ్ లాంటి పోలీసుల దురుసు ప్రవర్తనతో రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ట రోజురోజు దిగజారుతోంది.
• ఇటువంటి పోలీసుల ప్రవర్తనతో పౌరులకు రాజ్యాంగంలో ప్రసాధించిన ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతోంది.
• అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న సిఐ అంజూయాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి.
• తమరు తీసుకునే సత్వర చర్యలు మాత్రమే పోలీసుల ప్రతిష్టను కాపాడుతాయి.