-టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం
-ముఖ్యఅతిధిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్
-రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై చర్చ
జగన్ రెడ్డి పాలనలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో గిరిజనులు వ్యూహం ఎలా ఉండాలో చర్చించేందుకు తెదేపా గిరిజన నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ పాల్గొని దిశానిర్ధేశం చేశారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన భూములను, సంపదను యదేచ్ఛగా దోచుకున్నారు. గిరిజనులకు రాజ్యాంగపరంగా అమలు కావాల్సిన, తెదేపా ప్రభుత్వం గిరిజనులు తమ సొంతకాళ్లపై నిలబడేందుకు తీసుకొచ్చిన 16 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసిన గిరిజన వ్యతిరేకి జగన్ రెడ్డి అని అన్నారు.
జగన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించకపోతే గిరిజనుల అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. జగన్ రెడ్డి గిరిజన వ్యతిరేక కార్యక్రమాలపై గిరిజనులంతా ఏకమై గిరిజనులను ఏకతాటిపై నడిపిన బిర్సాముండా స్పూర్తితో పనిచేసి జగన్ రెడ్డి గద్దెదించాలని కోరారు.
తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధారు నాయక్ మాట్లాడుతూ…జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.5 వేల కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించారని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో స్వయం ఉపాధి పథకాల అమలుతో కళకళలాడిన గిరిజన యువత నేడు గంజాయి మత్తులో కొట్టుమిట్టాడుతోంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు గిరిజనులచే కాఫీ పండిస్తే నేడు జగన్ రెడ్డి వారి చేత గంజాయి పండించేలా ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్రంలో అక్కరకు రాని అంబులెన్సులు సమయానికి రాకపోవడంతో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కోసం డోలీలలో దవాఖాన్లకు తీసుకెళ్లినా సౌకర్యాల లేమితో గిరిజనులు ప్రాణాలు గాలిలో దీపాలైనాయి.
రాబోయే నాలుగు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోందని…గిరిజనులకు మంచి రోజులు రాబోతున్నాయని, జగన్ రెడ్డి నిలిపేసిన గిరిజన సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్దరిస్తామని అన్నారు.
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ మాట్లాడుతూ గిరిజనులకు అన్యాయం చేసినా వారు నోరు మెదపలేరని జగన్ రెడ్డి గిరిజనులకు తీరని అన్యాయాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ముస్లింలపై వైసీపీ రౌడీ మూకలు పేట్రేగిపోయి దాడులకు పాల్పడుతున్నారు. పాదయాత్రలో 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి నేడు తండాలు, గూడేలలో ఉంటేనే ఇస్తానంటూ తన పెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు.
దేశంలోనే అతిపెద్ద పెత్తందారైన జగన్ రెడ్డిని ఇంటికి పంపాల్సిన బాధ్యత గిరిజనులు తీసుకోవాలి. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మానికల ఏడుకొండలు, కార్యదర్శి మొగిలి కల్లయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు కత్తి పద్మ, మాజీ జెడ్‌పి చైర్‌పర్సన్ కాంతమ్మ, సోమ్లా నాయక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కాళియా నాయక్, కళావతి, ఈగా రామ్‌దాస్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.